
ఈ క్రమంలోనే ఇటీవల ఆసియా కప్లో ఫాంలోకి వచ్చినట్లు కనిపించిన విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్కప్ కు కూడా భారీగా పరుగులు చేయడం ఖాయమని అభిమానులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. టీమిండియా విజయంలో విరాట్ కోహ్లీ కీలకపాత్ర పోషిస్తాడని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అటు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉండడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. మొన్నటికి మొన్న కెరియర్ లో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే క్రికెట్కు వీడ్కోలు పలుకుతే బాగుంటుంది అంటూ వ్యాఖ్యానించాడు షాహిద్ అఫ్రిది.
దీంతో అతనిపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మరో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఇదే తరహాలో మాట్లాడాడు అని చెప్పాలి. టి20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కోహ్లీ గుడ్ బాయ్ చెబుతాడని అంచనా వేసాడు షోయబ్ అక్తర్. వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత ఈ ఫార్మాటు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. మిగతా ఫార్మాట్లలో మాత్రం అతను కొనసాగుతాడు. ఒకవేళ నేను గనక అతని స్థానంలో ఉండి ఉంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మిగతా రెండు ఫార్మాట్లలో బాగా రాణించడానికి టి20 ఫార్మట్ కు రిటైర్మెంట్ ప్రకటించే వాడిని.. కోహ్లీ కూడా అలాగే చేస్తాడు అని అనుకుంటున్నా అంటూ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.