ప్రస్తుతం భారత జట్టు లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో కె.ఎల్.రాహుల్ కూడా ఒకరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. కొన్నేళ్ల నుంచి కెరీర్లోనే అత్యుత్తమ మైన ఫాంలో కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీమ్ ఇండియాలో కీలక బ్యాట్స్మెన్ గా మారిపోయిన కె.ఎల్.రాహుల్ ఫార్మట్ తో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ప్రతి ఫార్మాట్లో కూడా ఒకే రీతిలో పరుగులు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి.


 అంతేకాదు కె.ఎల్.రాహుల్ బ్యాటింగ్ చూస్తూ ఉంటే అతని టెక్నికల్ షాట్స్ ప్రతి ఒక్కరిని కూడా అబ్బురపరుస్తు ఉంటాయి అని చెప్పాలి. అందుకే ఎంతో మంది మాజీ క్రికెటర్లు కె.ఎల్.రాహుల్ ప్రదర్శనపై స్పందిస్తూ అతను ఒక క్లాసిక్ క్రికెటర్ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఇటీవల కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ప్రతిభ పై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన ఫేవరెట్ క్రికెటర్లలో కె.ఎల్.రాహుల్ కూడా ఒకడని షేన్ వాట్సన్ తెలిపాడు.


 టీం ఇండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ లో ఎంతో స్కిల్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.  మిగతా బ్యాట్స్మెన్ లతో పోల్చి చూస్తే అతను ఎంతో సులభం గా ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోవడమే కాదు స్పిన్ బౌలింగ్ లో కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా షాట్లు ఆడుతూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఎంత బెస్ట్ బౌలర్ బౌలింగ్ చేసిన కూడా రాహుల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేయగల సత్తా కలిగి ఉన్నాడు.. అతని బ్యాటింగ్ లో ఎన్నో అద్భుతమైన షాట్స్ దాగి ఉన్నాయి అంటూ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. రాహుల్ బ్యాటింగ్ చేయడం చూస్తూ ఉంటే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ గుర్తుకు వస్తాడు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: