మహేంద్ర సింగ్ ధోని.. ఈ మాజీ క్రికెటర్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు అయితే దేవుడిగా భావిస్తూ ఉంటారు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ధోనిని ఒక గొప్ప కెప్టెన్ గా అభిమానిస్తూ ఉంటారు.  ఒత్తిడిలో కూడా చిరునవ్వుతోనే కనిపిస్తూ తన వ్యూహాలతో జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు భారత జట్టుకు రెండు ప్రపంచ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు ధోని. ఎంతోమంది క్రికెటర్లకు ఆదర్శం. కానీ గౌతమ్ గంభీర్ కు మాత్రం ధోని అంటే అస్సలు పడదు.


 ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పడం కాదు డైరెక్టుగానే తన పోస్టుల ద్వారా చెబుతూ ఉంటాడు గౌతమ్ గంభీర్. అసలు మహేంద్రసింగ్ ధోని పై గౌతమ్ గంభీర్ కు కోపం ఎక్కడ స్టార్ట్ అయిది అనే విషయాలను తెలుసుకుందాం.. 2012 ఫిబ్రవరి 12వ తేదీన భారత్ ఆస్ట్రేలియా మధ్య ఆడిలైట్ వేదికగా నాలుగో వన్డే మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులు చేసింది. అయితే టార్గెట్ చేదించే క్రమంలో చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన సమయంలో ధోని మ్యాచ్ గెలిపిస్తాడు. అందరూ ధోనిని పొగుడుతూ ఉంటారు.  కానీ 92 పరుగులు చేసి జట్టు విజయం లో కీలకపాత్ర వహించిన గంభీర్ ని మాత్రం పట్టించుకోరు.

 ఈ మ్యాచ్ సమయంలో మాట్లాడిన గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. థ్రిల్లింగ్ విక్టరీ పై  మీ ఫీలింగ్ ఏంటని అడగగా.. నిజానికి సులువుగా గెలవాల్సిన మ్యాచ్.. ధోని చివరి వరకు తీసుకొచ్చాడు. జిడ్డు బ్యాటింగ్ తో నస పెట్టాడు. బాల్ టు బాల్ రన్స్ మాత్రమే అవసరమైన సమయంలో లాస్ట్ వరకు లాక్కొచ్చాడు అంటూ గౌతమ్ గంభీర్  షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిజమే ధోని 58 బంతులు ఆడి 44 పరుగులు చేశాడు ఇందులో ఒకే ఒక సిక్స్ ఉండడం గమనార్హం. కానీ ధోని మేనియా నడుస్తూ ఉండడంతో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అప్పటినుంచి ధోనిపై కోపం పెంచుకున్నాడు గౌతమ్ గంభీర్. కాగా 2011 వన్డే వరల్డ్ కప్ లో 95 పరుగులు, అంతకుముందు 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన సమయంలో  75 పరుగులతో టాప్ స్కోరర్ గా గౌతమ్ గంభీర్ నిలిచాడు. కానీ క్రెడిట్ మొత్తం ధోనికే దక్కింది. తద్వారా ఇక ధోనిపై గంభీర్ కు కోపం మరింత పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: