అక్టోబర్ 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతున్నప్పటికీ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తుంది మాత్రం అక్టోబర్ 23వ తేదీన జరగబోయే మ్యాచ్ కోసం. ఎందుకంటే అందరి దృష్టిని ఆకర్షించే దాయాదుల పోరు అదేరోజు జరగబోతుంది. మొన్నటికి మొన్న ఆసియా కప్ లో భాగంగా రెండు సార్లు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.  కాగా ఒకసారి భారత్ మరోసారి పాకిస్తాన్ విజయం సాధించి మరోసారి ఈ రెండు జట్లు అసలు సిసలైన ప్రత్యర్ధులు  అన్న విషయాన్ని నిరూపించాయి అని చెప్పాలి.


 ఇక టి20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన పాకిస్తాన్ భారత్ మధ్య మరోసారి ఉత్కంఠ భరితమైన పోరు జరగబోతుంది. అయితే గత టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఎవరూ ఊహించిన విధంగా భారత్ పై పాకిస్తాన్ పది వికెట్ల  తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ పై భారత్ అదే రీతిలో పది వికెట్ల  తేడాతో విజయం సాధించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.


 కాగా ఇరు జట్ల బలాబలాలపై ఎంతోమంది ఎంతోమంది విశ్లేషకులు తమ రివ్యూ చెబుతున్నారు.భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా ఇదే విషయంపై స్పందించాడు. టీమిండియాలో నలుగురైదుగురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారని.. అదే పాకిస్తాన్ అయితే ఓపెనర్ల పైనే ఎక్కువగా ఆధారపడుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఎక్కువగా ఓపెనర్లు బాబర్,  మహమ్మద్ రిజ్వాన్ మీద ఆధారపడుతుంది. కానీ టీమ్ ఇండియాకు అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఒకరు ఇద్దరు ఆటగాళ్లను  నమ్ముకుని ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కనీసం నలుగురైదుగురు మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాదు అందరూ ఆటగాళ్లు కూడా మంచి ఫామ్ లో ఉండడం భారత్ కు కలిసి వచ్చే అంశం. అందుకే పాకిస్తాన్ కంటే బ్యాటింగ్ విభాగంలో భారత్ మంచి స్థాయిలో ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. బౌలింగ్ విషయంలో మాత్రం దాయాది దేశమే కాస్త పై చేయి సాధించేలా కనిపిస్తుంది అంటూ సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: