అయితే టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అనే విషయంపై ఇప్పటికే ఎంతోమంది రివ్యూలు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే అక్టోబర్ 23వ తేదీన అంటే రేపు ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కాబోతుంది. అదే సమయంలో ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ఎదుర్కోబోయే ప్రత్యర్థులు ఎవరు అన్న విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. పాకిస్తాన్ మాత్రమే కాదు వరల్డ్ కప్ లో టీమిండియా ప్రత్యర్ధులు ఎవరు అన్నది తెలుసుకోవడానికి కూడా అటు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.
ఇక ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..
అక్టోబర్ 23వ తేదీన ఇండియా, పాకిస్తాన్ మధ్య మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మ్యాచ్ జరుగుతుంది.
అక్టోబర్ 27వ తేదీన ఇండియా, నెదర్లాండ్స్ మధ్య మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ఉంటుంది.
అక్టోబర్ 30వ తేదీన ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య సాయంత్రం నాలుగున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
నవంబర్ రెండవ తేదీన ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ క్రమంలోనే తమ ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు పకడ్బందీ ప్లాన్లను సిద్ధం చేసుకుంది టీమ్ ఇండియా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి