టీమ్ ఇండియా జట్టుకు గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న ప్లేయర్లు ఊహించని రీతిలో గాయం బారిన పడుతూ జట్టుకు దూరం అవుతూ ఉండడం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో పటిష్టంగా ఉన్న టీమ్ ఇండియాలో టి20 వరల్డ్ కప్ కి ముందు ఇలాంటివే జరిగాయి. ఏకంగా జట్టులో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగిన రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.


 దీంతో ఇక వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా ప్రణాళికలు అన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి అని చెప్పాలి. అయితే రవీంద్ర జడేజా దూరమయ్యాడు అన్న షాక్ నుంచి తేరుకునే లోపే బుమ్రా కూడా మళ్ళీ గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. దీంతో టీమిండియా  బుమ్రా, జడేజా లాంటి ఇద్దరు కీలక ప్లేయర్లు లేకుండానే మ్యాచ్ ఆడింది. అయితే ఇక ఇటీవలే జడేజా మోకాలి గాయం నుండి కోలుకున్నాడు. అయితే అతను ఎప్పుడు జట్టులోకి వస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


 ఈ క్రమం లోనే టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు సిద్ధం కాగా.. వన్డే టెస్ట్ ఎంపిక చేసిన జట్టు లో రవీంద్ర జడేజా పేరు కూడా కనిపించడం తో అభిమానులు మురిసి పోయారు. కానీ ఇప్పుడు అభిమానులకు మళ్ళీ నిరాశే ఎదురు కాబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే రవీంద్ర జడేజా మోకాలి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదట. బంగ్లాదేశ్ తో వన్డేలకు రవీంద్ర జడేజా అందుబాటులో ఉండడం కష్టమే అని తెలుస్తుంది. దీంతో అతనీ స్థానంలో బెంగాల్ ఆల్ రౌండర్ శాబాజ్ అహ్మద్ ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉందట. డిసెంబర్ 4వ తేదీ నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: