న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇండియా నిన్నటి వరకు ఫలితం తేలిన ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించి పై చేయి సాధించగా, నేడు ఆక్లాండ్ లో జరిగిన మొదటి వన్ డే లో ఇండియాను 7 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా విజయాలలో సమానంగా నిలిచింది. అయితే మొదటి ఇన్నింగ్స్ మరియు రెండవ ఇన్నింగ్స్ లో 20 ఓవర్ ల వరకు ఇండియా ఆధిపత్యమే సాగినా, కీపర్ లాతమ్ రాకతో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కివీస్ కు అఖండ విజయాన్ని కట్టబెట్టాడు. మొదట టాస్ గెలిచిన కివీస్ ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఇండియా ఆటగాళ్లు ధావన్ , గిల్, శ్రేయాస్ అయ్యర్ మరియు వాషింగ్టన్ సుందర్ లు రాణించడంతో కివీస్ ముందు 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఇండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు మరియు శార్దూల్ ఒక్క వికెట్ తీసి కివీస్ ను కష్టాల్లోకి నెట్టారు. కానీ కెప్టెన్ విలియమ్సన్ మరియు లాతమ్ లు కలిసి ఆ తర్వాత వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు. వీరిద్దరిలో ఏ ఒక్కరిని అవుట్ చేసున్నా ఫలితం వేరేలా ఉండేది. కానీ ఇండియా బౌలెరలో పస లేకుండా పోయింది.. ఉమ్రాన్ మాలిక్ కూడా రెండు వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్ లో ఆకట్టుకున్న స్పీడ్ స్టర్ అర్షదీప్ సింగ్ కేవలం 8 ఓవర్ లలోనే 68 పరుగులు ఇచ్చాడు. శార్దూల్ ఠాకూర్ కూడా వచ్చిన అవకాశాలను అన్నిటినీ పోగొట్టుకుంటున్నాడు అని చెప్పాలి, ఈ మ్యాచ్ లో 9 ఓవర్లు సంధించి ఒక్క వికెట్ కు 63 పరుగులు ఇచ్చుకున్నాడు.

ఇక గాయాల తర్వాత తొలి వన్ డే సిరీస్ ఆడుతున్న సుందర్ స్పిన్ బౌలర్ గా ఏమంత ప్రభావం చూపలేకపోయాడు, ఒక్క వికెట్ కూడా తీయకపోవడం నిరాశపరిచింది . ఇక లెగ్ స్పిన్నర్ యఙవేంద్ర చాహల్ పది ఓవర్లకు 67 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలింగ్ యూనిట్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఇండియా బౌలింగ్ ఉంటే వన్ డే సిరీస్ ను గెలుచుకోవడం చాలా కష్టం. దీనితో సెకండ్ వన్ డే కు బౌలింగ్ యూనిట్ లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మధ్య విశేషంగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇచేలా ఉన్నారు.      





మరింత సమాచారం తెలుసుకోండి: