
భారత కెప్టెన్గా ఉన్న శిఖర్ ధావన్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మలను సరదాగా ఆట పట్టించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆటగాళ్లందరూ కూడా ఎయిర్పోర్టు నుంచి బయటికి వస్తున్న సమయంలో శిఖర్ ధావన్ ఒక వీడియో తీయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే చాహల్ ఏకంగా రెండు బ్యాగులను మోసుకు వస్తూ ఉండడం చూసి ఏకంగా యుజ్వేంద్ర చాహాల్ ను ధనశ్రీ వర్మ కూలీని చేసింది అంటూ కామెంట్లు చేశాడు శిఖర్ ధావన్. ఈ వీడియోలో అటు చాహల్ భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకోవడమే కాదు రెండు చేతులతో రెండు బ్యాగులు తీసుకు వెళుతున్నాడు చాహల్.
ఇక ఆ తర్వాత ఇక వెనకాల ఒక బ్యాక్ పట్టుకుని స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న చాహాల్ భార్య ధనశ్రీ వర్మను తన వీడియోలో చూపించాడు. ఇక ఇలా శిఖర్ ధావన్ చాహల్ అతని భార్యను ఆటపట్టించడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసి ఎంతో మంది అభిమానులు నవ్వుకుంటున్నారు. ధావన్ ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూయిస్తూ ఉంటాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.