గత కొంతకాలం నుంచి టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్న తీరు అటు జట్టుకు ఎంతగానో మైనస్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ మంచి ఆరంభాలు అందించి జట్టుకు విజయ తీరాల వైపుకు నడిపించాల్సిన రోహిత్ శర్మ ఒకవైపు కెప్టెన్ గా విఫలం అవుతూ ఉండడమే కాదు.. మరోవైపు ఒక ఆటగాడిగా కూడా పెద్ద గా రాణించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఒకరకంగా జట్టును గెలిపించాల్సిన కెప్టెన్ చివరికి జట్టుకే భారంగా మారిపోతున్నాడు అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ సమయం లో కూడా ఇలాంటి పేలువ ప్రదర్శన కొనసాగించిన రోహిత్ శర్మ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా అదే వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా మరోసారి రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన చేసి తీవ్రంగా నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది ఇక రోహిత్ శర్మ ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 బ్యాట్స్మెన్లా వైఫల్యం కారణం గానే టీమ్ ఇండియా ఓడి పోయింది అంటూ విమర్శలు చేసాడు. ముఖ్యంగా గత కొంత కాలంగా రోహిత్ శర్మ విఫలం అవుతూ ఉండటం జట్టుకు ఎంత ఇబ్బందికరం గా మారి పోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా రోహిత్ శర్మ తనను తాను మార్చుకొని ఇక మళ్ళీ మునుపటి ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ కూడా స్థాయికి తగ్గట్లుగా ఆడటం లేదని అభిప్రాయపడ్డాడు. ఇక జట్టు లోకి అరంగటం చేసిన కుల్దీప్ సేన్ ను మిగతా మ్యాచ్ లలో కూడా కొనసాగించాలి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: