
ప్రస్తుతం ఎయిమ్స్ ఆస్పత్రిలో రిషబ్ పంత్ చికిత్స పొందుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా నిన్నటి వరకు రిషబ్ పంత్ ఐసీయు లో చికిత్స తీసుకోగా ఇక ఇటీవలే అతన్ని ప్రైవేటు వార్డుకు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయ్ . ఇక రిషబ్ పంత్ ఎంతో వేగంగా కోలుకుంటున్నాడని అటు బీసీసీఐ అధికారులు కూడా చెబుతూ ఉండడంతో అభిమానులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇక రిషబ్ పంత్ ఆరోగ్యం పై స్పందిస్తున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
కాగా నేటి నుంచి శ్రీలంకతో టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో టీమిండియా బరిలోకి దిగ పోతుంది. అయితే ఇటీవలే మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. రిషబ్ పంత్ యాక్సిడెంట్ గురించి మాట్లాడాడు. పంతుకు ఇలా జరగడం దురదృష్టకరం.. అతను జట్టుకు ఎంతో ముఖ్యం. అతను లేకపోతే ఇతరులకు అవకాశం లభిస్తుంది. కానీ అతను టీంకు చాలా అవసరం అంటూ అటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.