సాధారణంగా మూడు ఫార్మాట్లలో ఆయా ప్లేయర్లు చేసిన ప్రదర్శన ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు ర్యాంకింగ్స్ ను ప్రకటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ర్యాంకింగ్స్ ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు వరకు కూడా మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లు తమ ర్యాంకులు అంతకంతకు మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ఇక అదే సమయంలో ఫెలవమైన ప్రదర్శన చేసిన వారు ఇక తమ ర్యాంకు నుంచి మరింత కిందికి వెళ్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ర్యాంకింగ్స్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే గత ఏడాది చివర్లో రోడ్డు ప్రమాదం బారినపడి తీవ్ర గాయాల పాలైన రిషబ్ పంత్.. ప్రస్తుతం ఆటకి దూరంగా ఉన్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో జట్టుకు అందుబాటులో లేడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో అతను స్థానం ఒకసారిగా దిగజారిపోయింది. మొన్నటివరకు ఐదవ స్థానంలో కొనసాగిన రిషబ్ పంత్ ఇక ఇప్పుడు ఆటకు దూరంగా ఉన్న నేపథ్యంలో  ఆరవ ర్యాంకు పడిపోయాడు అని చెప్పాలి. ఇలా బోర్డర్ గవాస్కర్   ట్రోఫీలో ఆడక పోవడం కారణంగానే ఒక ర్యాంకును కోల్పోయాడు అనేది తెలుస్తుంది.


 ఒకవేళ రిషబ్ పంత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడి ఉంటే మంచి ప్రదర్శన చేసేవాడని.. ఈ క్రమంలోనే టాప్ 3 ర్యాంకుకు చేరుకునేవాడు అని అభిమానులు భావిస్తూ ఉన్నారు. కాగా ప్రస్తుతం ఇక రోడ్డు ప్రమాదం బారిన పడిన రిషబ్ పంత్ కి మోకాలికి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ఇక మరికొన్ని రోజుల్లో మరో శాస్త్ర చికిత్స కూడా జరగబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక అతను త్వరగా కోలుకొని మళ్ళీ భారత జట్టులోకి అందుబాటులోకి రావాలని భారత అభిమానులు సహచర ఆటగాళ్లు కూడా ఆకాంక్షిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: