ఐపీఎల్ 2023 సీజన్ కు ఇంకో నెల మాత్రం సమయం ఉంది. అయితే ఎప్పుడైతే ఐపీఎల్ వేలం స్టార్ట్ అయిందో... అప్పటి నుండే ఐపీఎల్ అభిమానులు తమ తమ ఫేవరెట్ జట్లు మరియు ఆటగాళ్ల గురించి చర్చలు జరుపుకుంటున్నారు. కాగా గత సీజన్ నుండి ఐపీఎల్ లో మొత్తం పది జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే సీజన్ షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఐపీఎల్ ఎంతో ఆసక్తికరంగా మారనుంది. ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలు పక్కా ప్లానింగ్ తో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లనున్నాయి.

కాగా రానున్న సీజన్ లో కెప్టెన్ లుగా లేని రెండు ఫ్రాంచైజీలు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ లు ఇంతకు ముందు సీజన్ లో సన్ రైజర్స్ కు కెన్ విలియమ్సన్ కెప్టెన్ గా ఉండగా ... ఈ వేలంలో అతనిని ఫ్రాంచైజీ వదులుకుంది. దానితో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది, వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు మరియు జట్టు అంటి పెట్టుకున్న ఆటగాళ్లలో ఎవరు జట్టును సమర్థవంతంగా నడిపించగలరు అన్న ప్రశ్నకు ఈ మధ్యనే ముగిసిన సౌత్ ఆఫ్రికా టీ 20 లీగ్ లో సమాధానం దొరికింది. ఈ లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు సారధ్యం వహించిన సౌత్ ఆఫ్రికా ఆటగాడు మార్ క్రామ్ జట్టుకు మొదటి టైటిల్ ను అందించాడు.

ఈ లీగ్ లో అతని ప్రదర్శన గుర్తించిన సన్ రైజర్స్ యజమాని కావ్యా మారన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా కెప్టెన్ గా ఉండాలని అధికారికంగా ఈరోజు ప్రకటించింది. దీనితో నిన్నటి వరకు తర్వాత కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. మార్ క్రామ్ ఆల్ రౌండ్ నైపుణ్యం కలిగిన ఆటగాడు కావడం సన్ రైజర్స్ కు బాగా కలిసివస్తుంది అని చెప్పాలి. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు మరియు తన ఆఫ్ స్పిన్ తో ఎంతటి బ్యాట్స్మన్ ను అయినా బోల్తా కొట్టించగలడు. మరి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో టైటిల్ ను అందిస్తాడా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: