సాధారణంగా టి20 క్రికెట్ అంటేనే ఆటగాళ్ల విన్యాసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే టి20 మ్యాచ్లలో కొన్ని కొన్ని సార్లు పరుగులను కట్టడం చేయడానికి లేదా ప్రత్యర్థి వికెట్లను తీసుకోవడానికి ఆటగాళ్లు చేసే విన్యాసాలు ప్రేక్షకులు అందరినీ కూడా అబ్బురపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేశీయ లీగ్ లలో అయితే ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక టి20 మ్యాచ్ లో ఇలాంటివి ఏదైనా జరిగిందంటే ఆ వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయి నిటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కూడా ఇలాంటి ఒక స్టన్నింగ్ క్యాచ్ వీడియో వైరల్ గా మారింది. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ అయినా కీరన్ పోలార్డ్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల ముల్తాన్ సుల్తాన్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా పోలార్డ్ జట్టు అద్భుతమైన క్యాచ్ అందుకొని అభిమానులు అందరిని కూడా ఆశ్చర్యపరిచాడు. కరాచీ ఇన్నింగ్స్ 17వ ఓవర్ సమయంలో అబ్బాస్ ఆప్రీతి బౌలింగ్ వేశాడు. వెటరన్ బ్యాట్స్ మెన్ షోయబ్ మాలిక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగా బ్యాట్ కి కనెక్ట్ కాలేదు అని చెప్పాలి. దీంతో బంతిని అతను సిక్సర్ గా మలచాలి అని అనుకున్నప్పటికీ బంతి లాంగ్ ఆన్ దిశగా వెళ్ళింది. ఈ క్రమంలోనే లాంగాన్ లో ఫీల్డింగ్  చేస్తున్న కీరాన్ పోలార్డ్ మెరుపు వేగంతో ముందుకు కదిలాడు. ఈ క్రమంలోనే అద్భుతంగా గాలిలోకి డైవ్ చేసి క్యాచ్ ని అందుకున్నాడు అని చెప్పాలి. అయితే అప్పటివరకు 13 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన మాలిక్ కీరన్ పోలార్డ్ క్యాచ్ పట్టుకున్న తర్వాత నిరాశతో పెవిలియన్ చేరాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి కరాచీ కింగ్స్ మూడు పరుగుల తేడాతో ముల్తాన్ సుల్తాన్స్ చేతిలో ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: