
ఇరుజట్ల బలాబలాలు చూసుకుంటే అటు హర్మాన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ లో బరిలోకి దిగి తిరుగులేని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. కానీ మొదటి నుంచి స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో సత్తా చాటుతున్న యూపీ వారియర్స్ ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే యూపీతో ఆడిన గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక యూపీ వారియర్స్ పై నెగ్గి ప్రతీకారం తీర్చుకోవడమే కాదు ఫైనల్ అడుగు పెట్టాలని ముంబై ఇండియన్స్ జట్టు ఎంతో పట్టుదలగా ఉంది. ఇక కెప్టెన్ హార్మన్ ప్రీత్ కవర్ మంచి ప్రదర్శనలతో జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉండడం సానుకూల అంశం అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇక నేడు జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై అటు ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా రివ్యూ ఇస్తున్నారు అని చెప్పాలి. ఇక అభిమానులు తమ అభిమాన జట్టు గెలిచి ఫైనల్లో అడుగు పెట్టాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే సెమీఫైనల్ మ్యాచ్ కావడంతో యూపీ వారియర్స్ అటు ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీ పోరు జరగబోతుంది అని అందరూ అంచనా వేస్తున్నారు అని చెప్పాలి.