ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు తమ ఆట తీరుతో అదరగొట్టి బెస్ట్ ఫినిషర్లుగా పేరు సంపాదించుకున్న వారి లిస్ట్ తీస్తే అందులో ముందుగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరే వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. తన బ్యాటింగ్ తో బెస్ట్ ఫినిషర్ గా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఎప్పుడూ నాలుగు లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతూ క్లిష్ట  పరిస్థితుల్లో అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టు గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇక ధోని ఆడుతున్నాడు అంటే చాలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఇక జట్టు గెలుస్తుందని అభిమానులు అందరూ కూడా గట్టిగా నమ్ముతూ ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతూ ఉంటే అటు మహేంద్రసింగ్ ధోని మాత్రం సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. అందుకే వరల్డ్ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్లలో ఇక ధోనికి మొదటి వరుసలో చోటు దక్కుతూ ఉంటుంది. ఇక ధోని ఫినిషింగ్ గురించి ఇప్పటికీ కూడా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఎంతో గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ యువ ఆటగాడు సైతం ధోని ఫినిషింగ్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ ఫినిష్ చేయడంలో ధోని మాస్టర్ అంటూ చెప్పుకొచ్చాడు రియాన్ పరాగ్.


 మ్యాచ్ ను ఎంతో విజయవంతంగా ఫినిష్ చేయడంలో అతని దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రియాన్ పరాగ్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి అయినా తాను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చాడు. కానీ నన్ను ఎంపిక చేసుకోమని అడిగితే మాత్రం నాలుగో స్థానాన్ని ఎంపిక చేసుకుంటా. ఎందుకంటే ఫినిషిర్ పాత్ర పోషించడం నాకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నాకు ఫినిషర్ అంటే గుర్తుచేది ధోనినే. మ్యాచ్ ను మలుపు తిప్పడం ముగించడం విషయంలో ధోనీ నుంచి అన్ని విషయాలను నేర్చుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: