ఐపీఎల్ ప్రారంభమైంది అంటే చాలు ఇక క్రికెట్ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక వారి అభిమాన ఆటగాళ్లు కూడా ఐపిఎల్ లో భాగం అవుతూ ఉంటారు కాబట్టి. అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత వీకెండ్ ని మరింత ఇష్టపడుతూ ఉంటారు క్రికెట్ ఫ్యాన్స్. ఎందుకంటే ఐపీఎల్ వీకెండ్ లో ఏకంగా ఒకేరోజు రెండు మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 కాగా నిన్న కూడా డబ్బులు ధమాకా అటు ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచింది. ఇకపోతే ఈ రెండు మ్యాచ్లలో భాగంగా ఢిల్లీ, లక్నో జట్ల మధ్య కూడా మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మ్యాచ్ లో లక్నో జట్టు సత్తా చాటింది. మొదటి మ్యాచ్లో ఢిల్లీ జట్టుకి ఓటమి తప్పలేదు. ముఖ్యంగా ఢిల్లీ ఓడిపోవడానికి ఇక లక్నో బౌలర్ మార్క్ వుడ్ కారణం అని చెప్పాలి. బుల్లెట్ లాంటి బంతులను విసిరి ఏకంగా ఢిల్లీ ఓటమిని  శాసించాడు మార్కువుడ్. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టాప్ ఆర్డర్ ని కుప్ప కూల్చాడు అని చెప్పాలి.


 అంతేకాదు 2023 ఐపీఎల్ సీజన్లో మొదటి 5 వికెట్ల హాల్ కూడా నమోదు చేశాడు మార్క్ వుడ్. మొత్తంగా ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేశాడు. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను తీసుకున్నాడు. దీంతో ఇక గత ఏడాది ఐపిఎల్ లోకి అరంగేట్రం చేసిన లక్నో జట్టు తరఫున తొలి 5 వికెట్ల హాల్ నమోదు చేసిన ప్లేయర్ గా కూడా మార్కువుడ్ అరదైన రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి. ఇక ఐపీఎల్ హిస్టరీలో ఐదు వికెట్ల హాల్ నమోదవడం ఇది తొమ్మిదో సారి కావడం గమనార్హం. మొదటి మ్యాచ్లో విజయంతో అటు లక్నో జట్టు మంచి కాన్ఫిడెన్స్ సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: