సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్ ఏదైనా జరుగుతుంది అంటే ఆ మ్యాచ్లో తప్పకుండా ఐసిసి నిబంధనలు తూచా తప్పకుండా ఫాలో కావాల్సి ఉంటుంది. కానీ ఎందుకో పాకిస్తాన్లో మాత్రం ఐసీసీ నిబంధనలను ఫాలో అవుతున్నాము అని చెబుతూనే చేయకూడని తప్పులన్ని చేసేస్తూ ఉంటారు. ఇక ఇటీవల పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా ఇలాంటి ఒక పెద్ద తప్పిదమే చేశారు. ఇలాంటి తప్పిదం ఇప్పటివరకు అటు ప్రపంచ క్రికెట్ హిస్టరీలో ఎవరు కూడా చూసి ఉండకపోవచ్చు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే  జరిగిన ఘటన గురించి తెలిసి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏకంగా మైదానంలో అంపైర్లు 30 యార్డ్ సర్కిల్ దూరం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి మ్యాచ్ మధ్యలో సరి చేశారు. ఇది పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో జరిగింది. వాస్తవానికి అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే గ్రౌండ్ మేన్ కొలతలతో 30 యార్డ్ సర్కిల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల పాక్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం కొలతలు తప్పుగా తీసుకున్నారు అన్నది తెలుస్తుంది.



 30 యార్డ్ సర్కిల్ ఉండాల్సిన దానికంటే కాస్త దూరంగా పెట్టారు. అయితే పాకిస్తాన్ బౌలర్ నసీంషా తొలి ఓవర్ లో నాలుగు బంతులు వేసిన తర్వాత ఫీల్డ్ పైర్లుగా  ఉన్న అలిందార్, రషీద్ రియాజ్ లు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో వెంటనే మ్యాచ్ ని ఆపేసారు. ఇక గ్రౌండ్ మెన్ ను మళ్లీ పిలిపించి. 30 యార్డ్ సర్కిల్ సరి చేశారు అని చెప్పాలి. గ్రౌండ్ మెన్ తో పాటు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఇలా సర్కిల్ సరి చేయడం వైరల్ గా మారిపోయిన వీడియోలు చూడొచ్చు.  ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారగా.. పిసిబి ఘనకార్యం క్రికెట్ చరిత్రలో  ఇలా జరగడం ఇదే తొలిసారి అని అందరూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: