ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమమైన బ్యాట్స్మెన్ల లిస్ట్ తీస్తే అందులో అటు పాకిస్తాన్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న బాబర్ అజాం పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి కూడా అంతర్జాతీయ క్రికెట్లో మంచి ప్రదర్శన కనబరుస్తూ అదరగొడుతూ ఉన్నాడు. ఫార్మట్ తో సంబంధం లేకుండా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఒకవైపు కెప్టెన్ గా సక్సెస్ అవుతూనే మరోవైపు ప్లేయర్ గా కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు బాబర్ అజం.



 అయితే ఎంతోమంది దిగ్గజా ప్లేయర్లు సాధించిన రికార్డులను అటు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తే.. విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను బ్రేక్ చేయడమే పనిగా బాబర్ పెట్టుకున్నాడు. ఇప్పటికే కోహ్లీ రికార్డులను ఎన్నో బ్రేక్ చేశాడు. ఇక ఇటీవలే బాబర్ అజాం మరో అరుదైన రికార్డును కూడా సాధించాడు అని చెప్పాలి. ఇటీవలే బాబర్ కెప్టెన్సీలో అటు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పై వన్డే సిరీస్లో విజయం సాధించింది. 4-0 తేడాతో కేవీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఇక వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కూడా దక్కించుకుంది పాకిస్తాన్.



 ఇదిలా ఉంటే ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో పాక్ బ్యాట్స్మెన్ బాబర్ అజాం  చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా బాబర్ నిలిచాడు బాబర్. కేవలం 97 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు.  ఇక ఇందులో 17 సెంచరీలు 26 హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. అయితే గతంలో 101 ఇన్నింగ్స్ లలో 5000 పరుగులు పూర్తి చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు హసీం ఆమ్లా పేరిట ఉన్న రికార్డును ఇక ఇప్పుడు 97 ఇన్నింగ్స్ లో 5000 పరుగులు చేసి బాబర్ బద్దలు కొట్టాడు అని చెప్పాలి. అయితే పాకిస్తాన్ జట్టు ఫుల్ ఫామ్ లోకి రావడంతో ఇక ఆ దేశ అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం సంతోషంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: