ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని ఈ దాయాదులు పోరును చూడ్డానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఉత్కంఠ ఒక రేంజ్ లో ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కేవలం మైదానంలో ఉన్న ఆటగాళ్ళు మాత్రమే కాదు ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను కేవలం ఒక మ్యాచ్ గా మాత్రమే కాకుండా ఒక ఎమోషన్ గా చూస్తూ ఉంటారు.


 ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ జరిగిందంటే చాలు అప్పుడు రేటింగ్స్ కూడా రికార్డులు బద్దలు కొడుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఈ ఏడాది అటు భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్న క్రేస్ దృశ్య.. ఇక అహ్మదాబాద్ లో ఉన్న హోటల్ రెంట్స్ అన్ని కూడా ఒకసారి గా పెరిగిపోయాయి.


 అంతేకాదు మైదానం చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అన్నీ కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి అని చెప్పాలి. దీంతో బయట ప్రాంతాల నుంచి అహ్మదాబాద్ వచ్చే అభిమానులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మ్యాచ్ సమయానికి హోటల్స్ కు బదులు ఆసుపత్రిలో బెడ్ బుక్ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక పడకని రిజర్వ్ చేస్తే.. సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకుంటామని అభిమానులు చెబుతున్నారు. దీంతో అటు మ్యాచ్ కి వెళ్లొచ్చు. వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. కాగా ఆసుపత్రిలో పరిమిత బెడ్స్ మాత్రమే ఉంటాయి. మొదట రోగులకి మా ప్రాధాన్యమని అహ్మదాబాద్ ఆసుపత్రి వైద్యుడు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: