ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతున్న జట్లలో దాయాదులుగా కొనసాగుతున్న టీమ్స్ ఏవి అంటే ప్రతి ఒక్కరు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అని చెబుతూ ఉంటారు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలబడిన కూడా క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా మ్యాచ్లను వీక్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెష్ సిరీస్ ను రెండు టీమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయి. ఈ సిరీస్ లో విజయం సాధించాము అంటే చాలు.. దానిని ఒక గౌరవంగా అనుకుంటూ ఉంటాయి. కేవలం ఇరుజట్ల ఆటగాళ్లు మాత్రమే కాదు ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు కూడా ఇదే రీతిలో ఆలోచిస్తూ ఉంటాయ్ అని చెప్పాలి.


 అందుకే ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడూ యాషెష్ సిరీస్ జరిగిన కూడా అది వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య ఇటీవల యాషెష్  సిరీస్ ముగిసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఎవరు విజేతగా నిలవలేదు. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఆస్ట్రేలియా రెండు మ్యాచ్లు ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించాయి. దీంతో 2-2 తో అటు సిరీస్ సమం అయింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల యాషెష్ సిరీస్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సన్నివేశం గురించి ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 తాను మొదటిసారి యాషేష్ సిరీస్ ముగిసిన తర్వాత బీరు తాగకుండా ఉన్నాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సిరీస్ ముగిసిన తర్వాత ప్లేయర్స్ అందరూ కూడా బీరు తాగడం గురించి మాట్లాడుతున్నాము. బెన్ స్టోక్స్ ఉంటున్న గదికి వెళ్లి తలుపుతట్టామ్. కాసేపటికి అతను వచ్చాడు. ఇక రెండు నిమిషాలు ఆగండి అని చెప్పాడు. గంట అయినా అతను రాలేదు. దీంతో బీర్ కు నో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. నా క్రికెట్ కెరియర్ లో సిరీస్ తర్వాత బీరు తాగుకోవడం ఇదే తొలిసారి. అయితే ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ నన్ను క్షమించు మద్యం తాగాలని నిర్ణయించుకున్న కాబట్టి వదులుకోవద్దు తప్పక మద్యం తాగి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆ తర్వాత నేను నా గదికి వెళ్లిపోయా. మిగతావారు అతనితో కలిసి మద్యం తాగి ఎంజాయ్ చేశారు అంటూ సీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: