
అలాంటి ఫైనల్ మ్యాచ్లో పటిష్టమైన టీమిండియా ఇక సొంతగడ్డపై ఆడుతున్న శ్రీలంక టీమ్స్ ఉంటే ఆ ఫైనల్ మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఊహించని రీతిలో ఇటీవలే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఏకంగా గల్లీ క్రికెట్ లాగానే ఈ మ్యాచ్ కొనసాగింది అని చెప్పాలి. లంక జట్టు 50 పరుగులకే ఆ డౌట్ కాగా.. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ ఎంతో అలవకుగా టార్గెట్ ను చేదించింది. అయితే ఈ ఓటమి అటు లంక జట్టును కుదిపేసింది అని చెప్పాలి ఈ క్రమంలోనే ఇక జట్టుకు కెప్టెన్గా ఉన్న షనక వరల్డ్ కప్ కి ముందు కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాడు అని తెలుస్తుంది.
శనక కెప్టెన్సీలో గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యం భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా తో వన్డే టి20 సిరీస్లలో పేలవ ప్రదర్శన. ఇక ఇటీవల జరిగిన ఆసియా కప్ లో లంక దారుణమైన ఓటమి వెరసి ఇక శనగ కెప్టెన్సీ నుంచి తప్పుకునే పరిస్థితి కారణమవుతున్నాయట. అయితే శనగ కెప్టెన్ గా మాత్రమే కాదు అటు వ్యక్తిగతప్రదర్శనతో కూడా దారుణంగా నిరాశ పరుస్తూ ఉన్నాడు. అయితే ప్రస్తుతం శనగ అధికారికంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోకపోయినప్పటికీ రానున్న రోజుల్లో జరిగేది ఇదే అంటూ అందరూ అంచనా వేస్తున్నారు.