అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా భారత్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్ లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. అయితే 2011 తర్వాత టీమ్ ఇండియాకి వరల్డ్ కప్ గెలవడం అనేది కేవలం కలగానే మారింది. అయితే రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ లలో సెమీఫైనల్ వరకు వెళ్లినప్పటికీ.. ఇక తర్వాత సెమి ఫైనల్లో ఓడిపోయి ఇక అందరిని నిరాశపరిచి ఇంటిదారి పట్టింది టీం ఇండియా.


 అయితే పుష్కరకాలం తర్వాత ఇప్పుడు వరల్డ్ కప్ అటు భారత్ వేదికగా జరుగుతూ ఉండడంతో.. ఇక టీమిండియా తప్పకుండా టైటిల్ గెలవడం ఖాయమని అటు అభిమానులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటికే ఆసియా కప్ టైటిల్ గెలిచిన టీమిండియా ఇటీవల సొంత గడ్డపై ఆస్ట్రేలియాని కూడా ఓడించింది. దీంతో ఇక భారత జట్టు ఆట తీరుపై అందరికీ మరీత నమ్మకం వచ్చింది. అయితే ఇలాంటి సమయంలోనే టీమ్ ఇండియాను గాయాలు పెడితే తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో అశ్విన్ ను జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు.


 అయితే ఇలాంటి సమయంలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇంస్టా పోస్ట్ దుమారం రేపుతుంది. వరల్డ్ కప్ జట్టు నుంచి తొలగించిన కొద్ది గంటల్లోనే ఒక పోస్ట్ చేశాడు అక్షర్ పటేల్. కామర్స్ బదులు సైన్స్ తీసుకొని ఉండాల్సింది. మంచి పిఆర్ ను హైయర్ చేసుకోవాల్సింది అంటూ పోస్ట్ చేశాడు. ఇది చేసిన వారందరూ కావాలనే అక్షర్ పటేల్ ను జట్టు నుంచి తొలగించినట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞుడైన అశ్విన్ ను జట్టులో ఉంటే బాగుంటుంది అని స్వార్థంగా ఆలోచించిన సెలెక్టర్లు ఇక గాయం సాకుతో అక్షర్ ను జట్టు నుంచి పక్కన పెట్టి ఉంటారు అని అందరూ అనుకుంటున్నారు. మరి ఏం జరిగి ఉంటుందని మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: