
అయితే 2024 ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ సన్నాహాలను మొదలుపెట్టింది. డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా ఈ మినీ ఆక్షన్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈసారి వేలంలో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉండడంతో అందరికీ భారీ ధర పలికే అవకాశం ఉంది అని క్రికెట్ ప్రేక్షకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే మినీ వేలం జరగడానికి ముందే కొన్ని టీమ్స్ మాత్రం ఇతర టీమ్స్ లోని ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకుంటూ ఉండడం చూస్తున్నాం. మొన్నటికి మొన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తీసుకుంది.
ఇక స్టార్ ఆల్ రౌండర్ కామరూన్ గ్రీన్ నూ ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సిబి ట్రేడింగ్ చేసుకుంది. ఇక ఇప్పుడు మరో స్టార్ ఆటగాడు కూడా ఇలాగే జట్టు మారబోతున్నాడు అనేది తెలుస్తుంది. లక్నో జట్టుకు ఓపెనర్ గా కొనసాగుతున్న డికాక్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ట్రేడ్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గత ఏడాది మినీ వేలంలో డీకాక్ నూ లక్నో 6.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు అంతే మొత్తం చెల్లించి సన్రైజర్స్ అతన్ని సొంతం చేసుకోబోతుందట. కాగాడీకాక్ 2023 వన్డే వరల్డ్ కప్ లో సెంచరీల మోత మోగించాడు అన్న విషయం తెలిసిందే.