అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్ళు సుదీర్ఘ కాలం పాటు తమ కెరీర్ ను కొనసాగించాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ప్లేయర్లకు మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. ఇక వాళ్లే మూడు ఫార్మట్ లలో కూడా అద్భుత ప్రదర్శన చేసి లెజెండ్స్ గా ఎదుగుతూ ఉంటారు. అలాంటి ప్లేయర్లు ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటించారు అంటే వారికి ఘనమైన వీడ్కోలు కూడా లభిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యాడు ఒక స్టార్ ప్లేయర్.


 అతను ఎవరో కాదు ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్. ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్ తో పాటు టి20 వన్డేలలో కూడా కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు ఈ స్టార్ ప్లేయర్. అయితే గత కొంతకాలం నుంచి వార్నర్ రిటైర్మెంట్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. కానీ తాను ఇంకా అలసిపోలేదు. క్రికెట్ ఆడటానికి సిద్ధంగానే ఉన్నాను అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కొనసాగి సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ కి మాత్రం రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధమయ్యాడు.


 ఇలా తన ఆట తీరుతో క్రికెట్లో లెజెండ్ గా ఎదిగిన డేవిడ్ వార్నర్.. ఇక ఇప్పుడు తన కెరీర్ లోనే చివరి టేస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. పాకిస్తాన్ తో డిసెంబర్ 14వ తేదీ నుంచి మూడు మ్యాచ్ల రెడ్ బాల్ సిరీస్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ తర్వాత డేవిడ్ వార్నర్ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ కానున్నాడు. 2011లో టెస్టుల్లోకి అడుగు పెట్టిన డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 109 మ్యాచులు ఆడాడు టెస్టుల్లోనూ దూకుడైన ఆటతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు రిటైర్మెంట్ కు సిద్ధమయ్యాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: