వరల్డ్ కప్ టోర్నీలలో మాజీ ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న పాకిస్తాన్ జట్టు గత కొంతకాలం నుంచి మాత్రం చెత్త ప్రదర్శన చేస్తూ తీవ్ర స్థాయిల విమర్శలు ఎదుర్కొంటుంది  అయితే పాకిస్తాన్ క్రికెట్లో గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి.. ఎప్పటిలాగే నిరాశపరిచింది  పాక్. చిన్న టీమ్స్ చేతుల్లో సైతం ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. చివరికి కనీసం సూపర్ 8 లో కూడా అడుగుపెట్టలేక నిష్క్రమించింది.


 ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టులో ఉన్న ఆటగాళ్లు స్వలాభం కోసం సొంత రికార్డుల కోసం ఆడుతున్నారు తప్ప జట్టును గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయడం లేదు అంటూ ఎంతో మంది ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. ఇక ఆ జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న గ్యారి కిర్ స్టెన్  సైతం ఏకంగా అది జట్టు కాదని.. ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఆటగాళ్ల తీరు ఉంది అంటూ విమర్శలు గుప్పించాడు. ఇలాంటి సమయంలో సొంత జట్టు గురించి మాట్లాడటం మానేసి ఒక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కాస్త సంచలనగా మారిపోయాయి. టీమిండియా లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ స్వార్ధపరుడు అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీస్ ఆరోపణలు చేశాడు. వ్యక్తిగత రికార్డుల కోసం విరాట్ కోహ్లీ జట్టు ప్రయోజనాలను కూడా తాకట్టు పెడతాడు అంటూ చెప్పుకొచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా పై విరాట్ కోహ్లీ సెంచరీ కోసమే ఆడారు. ఉద్దేశపూర్వకంగానే ఆ మ్యాచ్లో పెద్ద షాట్లు ఆడలేదు. 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎవరైనా బంతులను వృధా చేస్తే నేను అసలు సహించలేను. ఎప్పుడు జట్టు గెలుపు దిశగానే ఆలోచించాలి అంటూ పాక్ మాజీ ప్లేయర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: