
మొత్తం 82 సార్లు రోహిత్ రెండంకెల స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ జాబితాలో తరువాత స్థానాల్లో దినేష్ కార్తిక్ (72), విరాట్ కోహ్లీ (59), రాబిన్ ఊతప్ప (57), శిఖర్ ధవన్ (56) లు ఉన్నారు. ఈ గణాంకాలు చూస్తే రోహిత్ ప్రదర్శన పట్ల తీవ్ర విమర్శలు రావడం సహజం. ఇక గత రాత్రి జరిగిన వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన కీలక పోరులో, ముంబయి టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.
ఢిల్లీ ఛేదనలో ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. టాప్ ఆర్డర్ విఫలమవడం వల్ల ఒక్కదశలోనూ లక్ష్యం చేరేలా ఆడలేకపోయారు. సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18) మాత్రమే స్వల్ప ప్రతిఘటన ఇచ్చారు. ముఖ్యంగా ముంబయి బౌలర్లు విజృంభించారు. మిచెల్ శాంట్నర్, జస్‌ప్రీత్ బుమ్రాలు 3 వికెట్లు తీసుకోగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. వీరి దెబ్బకి ఢిల్లీ పూర్తిగా చేతులెత్తేసింది. ఈ విజయంతో ముంబయి టాప్ 4లోకి ప్రవేశించింది.
రోహిత్ శర్మ సీజన్ పొడవునా పరాజయాలు, ఫామ్ కోల్పోవడం, ఇప్పుడు చెత్త రికార్డుతో కూడిన ఈ ఘట్టం అభిమానులను కలవరపెట్టింది. ఇటీవలి కాలంలో రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, బ్యాటింగ్ లోనూ ప్రభావం తగ్గడం నేపథ్యంలో ఆయన రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి.