ఎంఎస్ ధోని పేరు వింటేనే అభిమానులు ఉర్రూతలూగిపోతారు. క్రికెట్‌లో ఫినిషింగ్ షాట్‌లు కొట్టే ధోనీ… ఇప్పుడు మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాడంటే? అవును, అదే జరిగింది. ధోని తాజాగా ఓ పెళ్లి వేడుకలో పాల్గొని వరుడికి ఇచ్చిన సలహాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. మాస్టర్ ప్లానర్ అయిన ధోని .. ఇప్పుడు హస్బెండ్ లైఫ్ ప్లానింగ్ కౌన్సిలర్ అవతారం ఎత్తడంతో ప్రేక్షకులు అశేషంగా ఎంజాయ్ చేస్తున్నారు!ఒక వివాహ వేడుకలో స్టేజ్ మీదకు వచ్చిన ధోని, కొత్త జంటతో ముచ్చటిస్తూ మస్తీ చేశాడు. వరుడిని ఉద్దేశించి, "కొంతమందికి నిప్పుతో ఆడుకోవడం ఇష్టం. ఇతను అలాంటి వాళ్లలో ఒకడు" అని నవ్వుల పాలయ్యేలా వ్యాఖ్యానించాడు.
 

అంతే కాదు, "వెడ్డింగ్ తరువాత అందరికీ ఓ కామన్ లైఫ్ ఉంటుంది. మీరు వరల్డ్ కప్ గెలవగలిగారా లేదా అనేది మేటర్ కాదు. పెళ్లైనవారంతా అదే పరిస్థితిలో ఉంటారు!" అంటూ అసలైన మ్యారేజ్ జ్ఞానాన్ని పంచాడు. ఈ సరదా సంభాషణలో ధోని మరొక మజాగా లైన్ కొట్టాడు – “నీ భార్య అందరి కంటే వేరే అని అనుకోవద్దు.” వెంటనే వరుడు ఉత్కర్ష్ రియాక్ట్ అవుతూ, “నా భార్యేమీ వేరే కాదు” అన్నాడు. స్టేజ్ మీద ఉన్న వారంతా గట్టిగా నవ్వేశారు. ఆ మజా మైకలో రికార్డవడంతో వీడియో వైరల్ అయింది. దీనికి నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం పడుతోంది – “కెప్టెన్ కూల్ కాదు.. ఇప్పుడు మ్యారేజ్ గురుయే!” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.



ఇటీవలే ధోని తన 15వ వివాహ వార్షికోత్సవాన్ని సాక్షి సింగ్‌తో కలిసి జరుపుకున్నారు. వీరికి జీవా అనే కూతురు కూడా ఉంది. మైదానంలో శత్రువులకు చెమటలు పట్టించిన ధోని.. జీవితంలోనూ తన కూల్ హ్యుమర్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, IPL 2025లో ధోని చివరిసారి చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బయట పడటంతో మరోసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తన మాంత్రిక నాయకత్వంలో CSK జట్టు మళ్లీ టాప్ ఫామ్‌ కనబరిచింది. క్రికెట్‌కు దూరమైనా... హ్యూమర్‌కు, హైప్‌కు ధోనికి ఎప్పుడూ రిటైర్మెంట్ లేదు!



మరింత సమాచారం తెలుసుకోండి: