
అయితే తాజాగా వీరందరూ ఎంత మంది ఉన్నప్పటికీ టిఆర్పి రేటింగ్ మాత్రం చాలా డల్ గా ఉందన్నట్లుగా సమాచారం. ఇక వీరందరూ కలసి రష్మీ , సుధీర్ లేకుండా ఈ షో ని ఎలాగైనా నడిపించాలనుకున్నారు.అయితే ఈ షో కి కేవలం 3.5 రేటింగు మాత్రమే సాధించారు. వాస్తవానికి ఈ డాన్స్ షో లో పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని చెప్పవచ్చు.. కానీ ఎంత టైమ్ ఎంత ఫన్ అందించడంలో రష్మీ సుధీర్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక దాని ప్రభావం టిఆర్పి రేటింగ్ మీద కూడా పడినట్టు సమాచారం.
పూర్ణ స్థానంలో నందిత శ్వేతా ను తీసుకు వచ్చిన.. ఇక రష్మీ సుధీర్ తో పాటు పూర్ణ కూడా కాస్త స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేది.. సుధీర్ స్థానంలోకి అఖిల్ వచ్చినప్పటికీ ఆ ప్లేస్ ని భర్తీ చేయలేకపోయాడు అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మిగిలిన వారందరూ ఎలాగోలా పులిహోర కలుపుతున్న వినోదాన్ని మాత్రం పంచలేక పోతున్నారు. అయితే సుధీర్.. రష్మి స్థానాన్ని నైనిక, డాన్సర్ సాయి తో కలిసి భర్తీ చేయాలని చూశారు.. కానీ అది కూడా పెద్దగా వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదు. సుధీర్ , రష్మీ లేకపోతే ఇంతే మరి అంటున్నారు నెటిజన్లు..