
తాజాగా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో నూకరాజు పోస్ట్ చేస్తూ వీలైనంత త్వరగా పంచ్ ప్రసాద్ కు ఆపరేషన్ చేయాలని అందుకు చాలా ఖర్చవుతుందని దాతలు ఎవరైనా సహాయం చేయాలి అంటూ ఒక వీడియో రూపం లో వెల్లడించారు. ఇక నూకరాజు మాట్లాడుతూ.. పంచ్ ప్రసాద్ అన్న ఆరోగ్యం లో ఇప్పుడు ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఎన్నో హాస్పిటల్ కి తిరగాల్సి వచ్చింది అయినా ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. గత మూడు సంవత్సరాల క్రితమే ఆయన రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయితే అప్పటినుంచి ఆయన చాలా బాధ భరిస్తున్నాడు. ఈ కిడ్నీ సమస్య ఉన్నవారికి ఒకదాని వెనుక ఒకటి జబ్బులు వస్తూనే ఉంటాయి కాబట్టి ఆయనకు కూడా ఇదే జరుగుతోంది.
ఇక వీలైనంత త్వరగా పంచ్ ప్రసాద్ అన్నకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని దానికి లక్షల్లో ఖర్చు అవుతుందని ఎవరైనా ఆయనకి సహాయం చేయండి అంటూ చేతులెత్తి మరి వేడుకున్నారు. ఇందులో పంచ్ ప్రసాద్ ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కనిపించాడు.