జబర్దస్త్ స్టేజ్ పై గ్లామర్ బ్యూటీగా , లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటుంది. ఇతర చానల్స్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే వర్ష మాత్రం సున్నితంగా ఆఫర్లను తిరస్కరిస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేసిన వర్ష అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సీరియల్స్ లో కూడా నటించిన ఈమెకు ప్రస్తుతం సినిమాలలో అవార్లు వస్తున్నాయని.. అయితే హీరోయిన్గా చేసే ఆశ మాత్రం తనకు లేదు అని వెల్లడించింది. త్వరలో తాను ఒక పెద్ద షో కి హాజరవుతున్నానని.. ఇక తన చదువు గురించి అలాగే ఇతర విషయాల గురించి అక్కడ చెబుతానని వెల్లడించింది. బిగ్బాస్ షో ఎంట్రీ గురించి వర్ష ఈ విషయాలు చెప్పుకు రావడం గమనార్హం. ఇదిలా ఉండగా రెండు సంవత్సరాల క్రితం తన చిన్నన్నయ్యకు యాక్సిడెంట్ అయిందని.. ఆ సమయంలో బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడంతో బ్రతకడం కష్టమని వైద్యులు చెప్పారని వర్ష  తెలిపారు.

ఆ సమయంలో డాక్టర్ కాళ్లు పట్టుకొని ఎంత ఖర్చైనా అన్నయ్యని బ్రతికించమని కోరానని.. రెండు రోజులు వాష్ రూమ్ బయట పడుకున్నానని. అన్నయ్య కండిషన్ తనకు మాత్రమే తెలుసు అని.. ఆమె మరింత ఎమోషనల్ అయ్యారు. ఇక అన్నయ్యను అలా చూసి చచ్చిపోదాం అనుకున్నాను అన్నయ్య నాకు పంచప్రాణాలు ఆ తర్వాత దేవుడి దయతో అన్నయ్య కోలుకున్నాడు అంటూ చెప్పుకొచ్చింది వర్ష. ఇక వర్ష చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏది ఏమైనా తన జీవితంలో పడిన కష్టాలను మరొకసారి గుర్తుచేసుకొని ఆమె కన్నీటి పర్యంతం అవ్వడమే కాదు ఎదుటివారిని కూడా ఎమోషనల్ గా బాధ పెట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: