తెలుగులో బ్రహ్మముడి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయిన నటి దీపిక రంగరాజు గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో తమిళ సీరియల్స్ లో నటించిన ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా బాగానే పేరు సంపాదించింది. బ్రహ్మముడి సీరియల్ స్టార్ మాలో అద్భుతమైన రేటింగ్ ని సంపాదించుకున్నది. కావ్య పాత్రలో అద్భుతంగా నటించిన దీపిక ఈ మధ్యకాలంలో ఎక్కువగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా యాక్టివ్గానే కనిపిస్తున్నది. ఆహ లో ప్రసారమవుతున్న చెఫ్ మంత్రా ప్రాజెక్టులో కూడా కనిపించింది. అలాగే డాన్స్ ఐకాన్2 షోలో కూడా కనిపిస్తున్నది.


అలాగే తాజాగా ఆహాలో కాకమ్మ కథలు సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో  పాల్గొనింది.అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతున్నది. ఈ కార్యక్రమానికి తేజస్వి యాంకర్ గా చేస్తోంది. తేజశ్రీ దీపికను ఇలా ప్రశ్నిస్తూ.. లవర్ లండన్, ఫుడ్, కిస్, బెడ్ ఈ వర్డ్స్ అన్నిటినీ కలిపి ఒక వాక్యం తెలియజేయండి అంటూ తేజస్వి అడగగా.. అయితే ఇందుకు సమాధానం చెప్పిన దీపిక విషయం సంచలనంగా మారింది.


తన సిక్స్త్ లవర్ తో కలిసి లండన్ బ్రిడ్జిలో అందరూ చూస్తూ ఉండగా అసలు సిగ్గు లేకుండా అన్ని మర్చిపోయి ఒక ముద్దు ఇస్తే తనకు ఫుడ్డు కూడా అవసరం లేదని అలా నిలుచొని నిలుచొని టైడ్ అయిపోతాను కాబట్టి  బెడ్ అవసరమని సమాధానాన్ని తెలియజేస్తోంది. ఇది విన్న తేజు క్లాప్స్ కొట్టారు. ఇందుకు  సంబంధించి పూర్తి ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. వీడియో చూసిన నెటిజన్స్ సైతం షాక్ అవ్వడమే కాకుండా దీపికకు ముద్దు ఉంటే చాలు ఫుడ్  కూడా అవసరం లేదా అంటు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమా ఇలా డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పిందని మరి కొంతమంది నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: