
ముఖ్యంగా ప్రపంచంలో ఏ మూల నుంచి వచ్చినా కూడా అసలు యాక్టింగ్ ఏ రాకపోయినా తెలుగువాళ్లు అంటే ముందే పక్కన పెట్టేస్తున్నారని ఇప్పుడు తెలుగులో ఏ సీరియల్లో చూసిన కూడా కన్నడ హీరోయిన్స్ కనిపిస్తున్నారని తెలుపుతోంది. తెలుగులో కన్నడ, తమిళ వాళ్లే మెయిన్ రోల్స్ లో నటిస్తూ ఉన్నారని చిన్న చిన్న పాత్రలలో తెలుగు ఆర్టిస్టులకు నటిస్తూ ఉన్నారని తెలిపింది. కన్నడ సినీ పరిశ్రమలో అయితే 100 కి 100% కన్నడ వాళ్లే నటిస్తూ ఉన్నారని.. తమిళంలో తమిళ ఆర్టిస్టులు 80% ఇతర భాషల వాళ్ళకి 20 శాతం అవకాశం ఇస్తున్నారని తెలిపింది.
అయితే ఈ రెండు భాషలను మించి ఇప్పుడు తెలుగులో ఉల్టా పరిస్థితి ఏర్పడిందని బయట వాళ్లకు 90% తెలుగు వాళ్లకు 10 మాత్రమే ఇస్తున్నారు మరి ఇంత దారుణమా.. ముఖ్యంగా తెలుగులో వాళ్లకి యూనిట్ లేకపోవడమే ఇలా జరుగుతోంది అంటూ తెలిపింది శోభా శెట్టి. అయితే ఈ విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో శోభా శెట్టి vs అన్షు రెడ్డి మధ్య తెలుగు వాళ్లకి సరైన అవకాశాలు రాలేదని విషయం పైన టాపిక్ రావడంతో ఈ విషయాన్ని తెరమీదకి తీసుకువచ్చింది అన్షు రెడ్డి. అలాగే బిగ్ బాస్ షోలో కూడా మొత్తం కన్నడ వాళ్లే కనిపిస్తూ ఉన్నారు. తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదనే విధంగా ప్రశ్నించింది. కన్నడ నటులు తెలుగు వచ్చినా కూడా మనతో అసలు తెలుగులో మాట్లాడరని తెలిపింది అన్షు రెడ్డి. తెలుగు వాళ్లకి కాకుండా ఇతర భాష వాళ్లకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పలు రకాల చానల్స్ కు ,నిర్మాతలకు గట్టి కౌంటర్ వేసింది అన్షు రెడ్డి. శోభ శెట్టి కూడా ఎందుకు గట్టి కౌంటరే వేసింది.