
త్వరలోనే తొమ్మిదవ సీజన్ కూడా రాబోతోంది. ఇదంతా పక్కన పెడితే ఈ రియాలిటీస్ ద్వారా చాలామంది సెలబ్రిటీలు కెరియర్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఇందులోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాలను సంపాదించుకుంటున్నారు. అలా హీరో శివాజీ కూడా బిగ్ బాస్ వల్ల క్రేజీ సంపాదించుకొని సినిమాలలో నటిస్తున్నారు. అలా ఎంతోమంది ఇప్పటికి ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వల్ల సోషల్ మీడియా ద్వారా పేరుపొందిన సెలబ్రెటీలను బిగ్ బాస్ లోకి కాంటెస్ట్ గా తీసుకోవడం జరిగింది.
పల్లవి ప్రశాంత్, గంగవ్వ, ఆషూ రెడ్డి , షణ్ముఖ, అలేఖ్య, గీతూ రాయల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పేర్లే ఉన్నాయి. వీరంతా కూడా సోషల్ మీడియా ద్వారానే క్రేజీ సంపాదించుకున్నారు. అయితే ఇందులో కేవలం పల్లవి ప్రశాంత్ మాత్రమే టైటిల్ విన్నర్ గా గెలిచారు. అయితే ఇకమీదట సోషల్ మీడియా సెలబ్రిటీలకు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఉంటుందా లేదా అనే విషయం సందిగ్ధంగా ఉన్నది.. కేవలం టీవీ ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్టులకు మాత్రమే పరిమితం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ప్రారంభం కాబోతున్న హిందీ బిగ్ బాస్ 19 లో సరికొత్త రూల్స్ ని తీసుకురాబోతున్నారు మరి ఇలాంటి రూల్స్ ని తెలుగులో కూడా పాటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.