
వీటికి తోడు కొత్త కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తున్నారు. దీపిక రంగరాజు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను , సీరియల్స్ కు సంబంధించి సంగతులను తెలియజేస్తూ ఉంటుంది. సీరియల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకుపోతున్న దీపిక ఆ మధ్య హీరో నానితో కలిసి ఒక యాడ్ లో నటించింది. ఇటీవలే జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న ఒక షోలో మాట్లాడుతూ బ్రహ్మముడి సీరియల్ లో నటించడం అదృష్టమని ఈ సీరియల్ వల్లే పేరు వచ్చిందని తెలిపింది. చిన్నప్పటి నుంచే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలని కళ కలగానే మిగిలిపోయింది. ఇప్పటివరకు అది పూర్తి కాలేదని తెలిపింది.
అలాగే బిగ్ బాస్ 9 లో అవకాశం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి ఇదంతా నిజం కాదని తెలిపింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువగా ఉంది. మనం అలాంటి వ్యక్తులం కాకపోయినప్పటికీ కూడా చాలామంది మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇలాంటివి తాను కూడా ఇండస్ట్రీలో ఫేస్ చేశానని.. బుల్లితెర ఇండస్ట్రీ 100% ప్యూర్.. కానీ కొంతమంది వేస్ట్ పీపుల్స్ వల్ల నిజంగా సినిమాలు తీసే వాళ్ల పరిస్థితి కూడా అలాగే మారిపోయింది అంటూ తెలిపింది. సినిమా అనే ఒక బ్రాండ్ ని అడ్డం పెట్టుకొని దాని పేరు మీద తప్పుడు పనులు చేస్తున్నారు.. అలాంటివి తన దృష్టికి వస్తే వారిని కచ్చితంగా బ్లాక్లో పెట్టేస్తాను అంటూ తెలియజేసింది.