బుల్లితెరపై ఆడియన్స్ సైతం ఎంతో ఎక్సైటింగ్గా ఎదురుచూసే షో బిగ్ బాస్. ఈ షో కి దేశవ్యాప్తంగా వివిధ భాషలలో కూడా భారీగానే క్రేజీ ఉన్నది. ఇప్పటికే తెలుగు, హిందీ వంటి భాషలలో కూడా కొత్త సీజన్లకు సంబంధించి అప్డేట్లు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ రాబోతూ ఉండగా హిందీలో 19వ సీజన్ రాబోతోంది. ఈ క్రమంలోనే హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.


అదేమిటంటే పహల్గామ్ ఉగ్రదాడిలో  ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ బిగ్ బాస్ 19వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు  బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈసారి ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యే విధంగా చాలామందిని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే హిమాన్షి ని సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు అటు బిగ్ బాస్ నిర్వహకుల నుంచి కానీ, హిమాన్షి నుంచి గాని ఏ విధమైనటువంటి ప్రకటన అయితే రాలేదు.


వివాహమైన రెండు నెలలకే ఉగ్రదాడిలో తన భర్తను కోల్పోయిన హిమాన్షి కన్నీటి కథ ఎంతోమందిని కలచివేసింది. 2025 ఏప్రిల్ కాశ్మీర్ పహాల్గామ్  ఉగ్రదాడి ఘటన దేశాన్ని కలచివేసింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు కూడా ప్రాణాలు తీశారు ఉగ్రవాదులు. అందులో హిమాన్షి భర్త కూడా ఉన్నారు. హనీమూన్ కోసం వెళ్లిన ఈ దంపతులకు ఇలాంటి విషాద సంఘటన మిగిలింది. వినయ్ మృతదేహం పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫహల్గమ్ దాడికి  ప్రతి చర్యగా కూడా ఇండియా, పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన యుద్ధం ప్రకటించి టెర్రరిస్టుల స్థావరాలను టెర్రరిస్టులను కూడా అంతం చేసింది. ఇందుకు ఆపరేషన్ సింధూర్ పేరు కూడా పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: