హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 6.1 ప్లస్‌ను భారత మార్కెట్‌లో   విడుదల చేసింది. గ్లోస్ మిడ్‌నైట్ బ్లూ, గ్లోస్ వైట్, గ్లోస్ బ్లాక్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.15,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది.    గత నెలలో హాంకాంగ్‌లో ఈ ఫోన్‌ను గ్లోబల్‌ వెర్షన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసిన నేపధ్యంలో ఇప్పటివరకు వచ్చిన నోకియా ఫోన్ల మాదిరిగా కాకుండా 6.1 ప్లస్‌ డిజైన్‌ సరికొత్తగా రూపొందించారు.


 ఫ్లిప్‌కార్ట్‌, నోకియా ఆన్‌లైన్ స్టోర్లలో ఆగస్టు 30 నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 5.8 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు.


నోకియా 6.1 ప్లస్‌ ఫీచర్లు..

- 5.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే 

స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌

 4 జీబీ ర్యామ్‌

  64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, మెమొరీ కార్డు ద్వారా 400 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే సదుపాయం

 ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌

  వెనుకవైపు 16 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌తో రెండు కెమెరాలు

  ముందువైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా

  టైప్‌ సిపోర్ట్‌

 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం



మరింత సమాచారం తెలుసుకోండి: