ఈ ఫోన్ 108 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. ఇప్పుడు మార్చ్ 24 న మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫోన్ పూర్తి వివరాలను హీరో మాధవ్ ఒక వీడియోలో ప్రకటించారు. 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఇది సాధించండి. రియల్ మీ ఛాలెంజ్ స్వీకరించండి" అని ఆయన అన్నారు. మార్చి 24న ఈ సంస్థ రియల్ మీ 8-సిరీస్ ను ఆవిష్కరిస్తుందని, దీనికి 108 మెగాపిక్సెల్ కెమెరా సామర్థ్యమున్నట్లు ఈ వీడియో చూసి పలువురు అభిప్రాయపడుతున్నారు.
రియల్ మీ 8-సిరీస్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా సెన్సార్ తో పాటు మరికొన్ని స్పెసిఫికేషన్లు కలిగి ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. అయితే రియల్ మీ 8 ప్రో 108 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.రియల్ మీ 8 ప్రో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో 65 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో అందుబాటులోకి రానుందని నివేదించింది. ఇది ఆండ్రాయిడ్ 11- ఆధారిత రియల్ మీ యూఐ 2.0తో నడుస్తుందని తెలిపింది... సెల్ఫీ ప్రియులకు మాత్రం ఈ ఫోన్ చక్కగా ఉపయోగ పడుతుందని స్పష్ట మవుతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి