2030 దాకా మనం బతికి బట్ట కడతామో లేదో తెలియని పరిస్థితి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయిందట. వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ నిజం వెనుక ఉన్నది ఎవరో కాదు, మనమే ముద్దుగా పెంచుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే టెక్నాలజీ భూతం.

అవును, ఏఐ కంపెనీలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతాయి కానీ, సామాన్యుడి బతుకు మాత్రం అగాధంలోకి పడిపోవడం ఖాయం. ఒకప్పుడు వందమంది కార్పొరేట్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తలలు పగలగొట్టుకుని చేసే పనిని, ఇప్పుడు ఒక్క ఏఐ బాస్ చిటికెలో చేసి పారేస్తుంటే... ఆ వందమంది పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడవా? చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు, బ్రాండెడ్ బట్టల షాపుల వైపు, ఖరీదైన రెస్టారెంట్ల వైపు కన్నెత్తి అయినా చూడగలమా? ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, నిత్యావసరాలు... ఇవన్నీ గాలిలోంచి ఊడిపడవు.

ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే, మార్కెట్లన్నీ మూగబోతాయి. పరిశ్రమలన్నీ చతికిలపడతాయి. డిమాండ్ లేని ఉత్పత్తి ఎవరికి కావాలి? కరోనా సమయంలో చూశాం కదా, జనం ఖర్చు తగ్గించగానే ఆర్థిక వ్యవస్థ ఎలా తల్లకిందులైందో... ఇప్పుడు అంతకుమించిన గడ్డు పరిస్థితి తలుపు తట్టబోతోంది. ఆర్థిక నిపుణులు ఇదే విషయాన్ని ఘోషిస్తున్నారు.

2030 నాటికి ప్రతి పది ఉద్యోగాల్లో నాలుగు శాశ్వతంగా కనుమరుగైపోతాయంటే నమ్మగలరా? ఇది కల కాదు, కఠోర వాస్తవం. ఏఐ, రోబోటిక్స్ మహమ్మారి సృష్టించబోయే నిరుద్యోగ సునామీ ఇది. మనిషి మేధస్సుకు మించిన వేగంతో పనిచేసే ఈ యంత్రాల ధాటికి, మానవ శ్రమకు విలువ లేకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తోంది.

ఇక ప్రపంచీకరణ శకం ముగిసి, డీ-గ్లోబలైజేషన్ పర్వం మొదలవుతుందని ఆర్థిక వేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. దేశాలు తమ సరిహద్దులను మరింత బిగించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రతి దేశం తమ పౌరుల ప్రయోజనాలకే పెద్దపీట వేసుకునే స్వార్థపూరిత వాతావరణం నెలకొనబోతోంది.

ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, భవిష్యత్తు మన తలుపు తడుతున్నప్పుడు మనం ఎంత సిద్ధంగా ఉన్నామో తేల్చుకోవాల్సిన సమయం. రాబోయే గండం నుంచి గట్టెక్కాలంటే, ప్రభుత్వాలు, ప్రజలు ఇప్పటినుంచే మేల్కొని ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే, చరిత్రలో మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభానికి మనమే సాక్షులుగా నిలవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: