ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. అయితే ఇలా ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడం కేవలం ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. దాదాపు ప్రపంచ దేశాలు అన్నిటిలో కూడా ఇక ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది అని చెప్పాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలు నడపడం మానేసి ఎంతోమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉండడం కారణంగా చివరికి ఇక ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక ఇలాంటి ప్రమాదాల కారణంగా ఎంతో మంది గాయాల బారిన పడి జీవచ్ఛవాలుగా మారిపోతుంటే ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది.


 అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన కూడా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే ఎన్నో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూసి షాక్ అవ్వడం నేటిజన్స్ వంతు అవుతూ ఉంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. అతివేగం ఎంత దారుణంగా ప్రాణాలు తీస్తుంది అన్నదానికి ఈ వీడియో నిదర్శనంగా మారిపోయింది. వేగంగా దూసుకు వచ్చిన కారు టోల్ బూత్ ను ఢీకొట్టడంతో కేవలం రెప్పపాటు కాలంలో కారు నుజ్జు నుజ్జుగా మారిపోయింది. ఇక సినిమాల్లో కూడా ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరగదేమో అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అని చెప్పాలి. చీలి నగరంలోని పురంగ్ లో ఈ ఘటన వెలుగు చూసింది అనేది తెలుస్తుంది. టూల్ బూత్ బారియర్ పైకి అతివేగంగా దూసుకు వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రెప్పపాటు కాలంలో కారు పార్ట్శ్ మొత్తం చెల్లాచెదురుగా  మారిపోయి పూర్తిగా ధ్వంసం అయింది. ఇక డ్రైవింగ్ చేస్తున్న 21 ఏళ్ళ కుర్రాడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇదంతా అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: