ఇంటర్నెట్ డెస్క్: ‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు..? నాయనా..’ ఇలాంటి ప్రశ్న చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో చాలా మందికి తెలియదు. అయితే ఓ వ్యక్తి దీనికి ఓ మంచి ఉపాయం కనిపెట్టాడు. తాను ఎంఐ10టీ మొబైల్ కొనేవరకు పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. ఇదే విషయాన్ని డిసెంబరు 11న ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌ ఊహించని విధంగా షావోమీ కంపెనీకి చేరింది. అంతే అతడికి ఓ సీల్డ్ మొబైల్‌ను ఫ్రీగా గిఫ్ట్ చేసింది. ఈ గిఫ్ట్ పొందిన అతడు మరో ట్వీట్ చేశాడు. ఎట్టకేలకు అద్భుతమైన ఈ ఫోన్ తన చేతికొచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు.

వివరాల్లోకి వెళితే.. కమల్ అహ్మద్ అనే వ్యక్తి ఈ నెల 11న ఎంఐ10టీ మొబైల్ తీసుకునే వరకు పెళ్లి చేసుకోనని ట్వీట్ చేశాడు. దీనికి మూడు నవ్వుతున్న ఎమోజీలు కూడా యాడ్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటు ఇటు తిరిగి ఎంఐ కంపెనీ కంట పడింది. అంతే కంపెనీ ఓ కొత్త మొబైల్‌ను కమల్ అహ్మద్‌కు పంపింది. ఆ మొబైల్ 21న అతడికి చేరింది. ఊహించని విధంగా కంపెనీ నుంచి ఫ్రీ మొబైల్ రావడంతో అహ్మద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన ఆనందాన్ని మళ్లీ ట్వీటర్ ద్వారానే పంచుకున్నాడు.

 ఈ ట్వీట్‌లో చేతిలో ఎంఐ10టీ ప్రో మొబైల్‌‌ను పట్టుకున్న ఫోటోలను అతడు పోస్ట్ చేశాడు. ‘ఎట్టకేలకు ఈ రాక్షసి నా చేతికొచ్చింది. దీని డిస్‌ప్లే అదిరిపోయింది. ఈ ఫోన్ ఎంతో అందంగా ఉంది. అద్భుతమైన 108 ఎంపీ ఫ్లాగ్ షిప్ మొబైల్. ఇంకా ఎన్నో ఫీచర్స్. 40 వేల లోపు ఇంతకంటే బెస్ట్ మొబైల్ వేరే ఉండదు. షావోమీ ఇండియా, మనుకుమార్ జైన్‌లకు థాంక్యూ సో మచ్’ అంటూ ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: