మన భూమి మీద ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మనకు తెలుసు. అవన్నీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవే. ఇవన్నీ కాకుండా మానవునిచే సృష్టించబడిన అద్భుతాలలో "టైటానిక్" కూడా ఒకటి. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే టైటానిక్ ఒక ఐస్ కొండను ఢీ కొని మునిగిపోయిందని తెలుసు. అలా సముద్రంలో మునిగి పోవడానికి ఒక కారణం ఉంది.అది ఏంటో తెలుసుకుందాం.

టైటానిక్ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రేమికులు. ఇక అలాగే టైటానిక్ అనే పేరుతో విడుదలైన సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంది. అయితే టైటానిక్ ప్రమాదం మాత్రం అందరికి కన్నీటి గాథను మిగిల్చింది. 1912 వ సంవత్సరం లో నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో రాత్రి సమయంలో 11:40 లకు సముద్ర గర్భంలో మునిగిపోయింది. అయితే ఇప్పుడు టైటానిక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
1).RMS టైటానిక్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్. ఈ షిప్ యొక్క ఎత్తు 882 అడుగులు, షిప్ యొక్క వెడల్పు 92 అడుగులు, ఇక బరువు విషయానికొస్తే..46,320 టన్నుల బరువు కలదు.


2). ఇంత సామర్థ్యం గల షిప్ కు ఏకంగా తొమ్మిది అంతస్తులు ఎత్తు వరకు గదులు ఉన్నాయి. వాటిని ప్రయాణికుల కోసం క్లాసులు (1 st,2nd) వారిగా విభజించారు.

3). ఇక ఇందులో లేటెస్ట్ జిమ్ స్పెషలిస్ట్ లు కూడా  కలరు. ఇందులో ఒక రెస్టారెంట్ కూడా ఉండేది, దానిని ఒక ఇటాలిక్ చెఫ్ రన్ చేసేవాడట.
4). ప్రపంచంలోకెల్లా అత్యధిక  పరిమాణం కలిగిన షిప్ ను ప్రతిరోజు నడపడానికి 800 టన్నుల బొగ్గును ఖర్చు చేసేవారట. ఇది గంటకు 27 కిలోమీటర్ల వరకు వెళుతుంది.

5). ఇందులో  టెలిఫోన్ సదుపాయం కూడా ఉండడంతోపాటు, దీనికి ఒక ప్రత్యేకమైన సొంత పేపర్ ప్రింట్ "అట్లాంటిక్ డైలీ బులిటెన్ "కూడా ఉండేదట.

6). ఇందులో  మనుషులు 3200 మంది ఉండగలరు. వీరి కోసం 14,500 ట్యాంకుల నీటిని  ప్రతిరోజు అందించే వారట.7). ఒకసారి మీరు టైటానిక్ ఫోటోను చూసినట్లయితే పైన నాలుగు స్తంభాలు కనిపిస్తాయి.అందులో నుంచి పొగ వస్తున్నట్లు. కానీ అందులో చిట్టచివరిగా ఉండేది షిప్ అందం కోసం పెట్టినది మాత్రమే.8). టైటానిక్ షిప్ లో ఫస్ట్ క్లాస్ ప్రయాణం చేయాలంటే.. ఇందులో ఇప్పుడు ఉన్న ధర వ్యత్యాసం చూసుకున్నట్లయితే 99,000 డాలర్లు. ఇక మన కరెన్సీ ప్రకారం ఇంచుమించు 75 కోట్ల రూపాయలట.టైటానిక్ షిప్ తన మొదటి ప్రయాణం చేస్తున్న కొన్ని గంటల ముందు.. టైటానిక్ లో పనిచేసే"డేవిడ్ బ్రేయర్"అనే వ్యక్తిని, తన విధుల నుంచి తొలగించి అతని ప్లేసులో.."చార్లెస్"అనే వ్యక్తి నియమించారు. ఇక్కడ డేవిడ్ బ్రేయర్ చేసిన తప్పు ఏమిటంటే, తన దగ్గర ఉన్న"బైనో క్లాక్ "యొక్క రూమ్ తాళాలు చార్లెస్ కు ఇవ్వకపోవడం. ఈ తాళాలు మర్చిపోవడం చేత దూరంగా ఉన్న వస్తువులను చూడలేక.. దగ్గరగా వచ్చిన మంచు కొండను ఢీ కొట్టడంతో టైటానిక్ షిప్ మునిగిపోయింది.

"మానవులు చేత సృష్టించబడిన ఒక అద్భుతం, తిరిగి మానవుడు చేసిన చిన్న తప్పిదం వల్ల నాశనం అయ్యింది".


మరింత సమాచారం తెలుసుకోండి: