దేశానికి వెన్నెముక లాంటిది ఇండియన్ ఆర్మీ సంస్థ.. వీరు లేకుంటే మనం దేశ రక్షణ కాపాడుకోలేక పోతూ ఉంటాము. అందుచేతనే వీరికి ఎక్కడికి వెళ్లినా కూడా కాస్త గౌరవిస్తూ ఉంటారు మన ప్రజలు. అయితే ఇలాంటి వారికి ఎన్నో కష్టాలు, అనుకోకుండా మరణాలు వంటివి సంభవిస్తూనే ఉంటాయి. అయితే గత కొద్ది రోజుల నుండి ఆర్మీ కి సంబంధించిన హెలికాఫ్టర్లు కుప్పకూలుతునే ఉన్నావి.. అయితే తాజాగా ఇప్పుడు ఒక ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

కాశ్మీర్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా తెలియజేయడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే ఉత్తర కాశ్మీర్లోని బందిపోట్లు జిల్లా గురేజ్ సెంటర్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లుగా అక్కడ ఉండే అధికారులకు తెలియజేయడం జరిగింది. అనారోగ్య సమస్యతో గురైన ఒక BSF జవాను తీసుకువెళ్లేందుకు వచ్చిన హెలికాప్టర్ ఈ సంఘటనకు చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.. అయితే ఈ ప్రమాదానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ల్యాండింగ్ కోసం దింపుతూ ఉండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైందా.. వాతావరణం అనుకూలించక ఇలా జరిగిందా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.


అయితే ఒక అధికారి మాత్రం వాతావరణ సరిగ్గా లేకపోవడంతో వెనక్కు తిప్పే ప్రయత్నం లో ఇ సంఘటన జరిగిందని సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి కొంత మంది సైనికులు సహాయక బృందాలతో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక అక్కడ ఉండే  పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు అధికారులు. ప్రమాదంలో ఎవరైనా మరణించారా.. ప్రాణాలతో ఉన్నారా.. ఈ సంఘటన ఎలా జరిగింది వంటి వివరాలను అధికారులు త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: