ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి నాయకులపై మరోవైపు వైసీపీ నాయకులపై వారి వారి కుటుంబ సభ్యులు ఎదురు తిరిగిన సంఘటనలు మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ముద్రగడపై తన కూతురు,  అంబటి రాంబాబుపై తన అల్లుడు విపరీతంగా విమర్శలు చేశారు.  ఇది మరవకముందే గద్దె రామ్మోహన్ పై ఒక విమర్శ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.  విజయవాడ తూర్పు టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గద్దె రామ్మోహన్ పై సోషల్ మీడియా వేదికగా ఒక యూజర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాట్సాప్ స్క్రీన్ షాట్లు, కొన్ని ఫోటోలు  షేర్ చేశారు. నా పేరు వాసు అంటూ ఒక వ్యక్తి రాసుకొచ్చిన  ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 

ఇంతకీ ఆయన ఏమన్నారయ్యా అంటే.. గత 15 సంవత్సరాలుగా తనతో నీచమైన పనులు చేయించుకున్నారని, మూడో వ్యక్తికి తెలియకుండా తన అవసరాలన్నీ  నేనే తీర్చానని చెప్పుకొచ్చారు. మీరు చేసింది పెద్ద తప్పు సార్.. మీ దగ్గర నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను.  మీకు నా గురించి తెలుసు కానీ నన్ను ఇంత నీచంగా అవమానంగా మాట్లాడతారని నేను ఊహించలేదు. ఏ మనిషికైనా సొంత ఆత్మాభిమానం అనేది ఉంటుంది.  దాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఎవరూ ఊరుకోరు. 15 సంవత్సరాల నుంచి మీరు ఏది అడిగినా ఆ కోరికలన్నీ తీర్చాను. నీ నిచమైన చీకటి బతుకును ప్రజలకు వివరించాలని నీలాంటి మేక వన్నె తోడేలును ప్రజలు నమ్మకూడదనే ఆరోపణలు చేశారు. నీ వల్ల ఇంకో అమ్మాయి మోసపోకూడదనే ఇవన్నీ బయట పెడుతున్నానంటూ  రాసుకొచ్చారు. నీ కామ వాంఛకు ఎంత మంది జీవితాలు బలయ్యాయో నీకు నాకు తెలుసు అన్నారు.

"ముసలోడికి దసరా పండుగ" అన్నట్టు ఈ వయసులో రామ్మోహన్ కు అమ్మాయిల పిచ్చి ఉందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. అంతేకాకుండా  నీ గురించి ప్రతిరోజు  ఎవరికి తెలియని విషయాలు బయటపెడతానని  సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరారు. ఆ వ్యక్తి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నవేళ ఇలాంటి విషయాలు బయటకు రావడంతో రామ్మోహన్ తల పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో ఎంత వరకు అబద్ధం ఉందో తెలియాలి అంటే  స్వయంగా రామ్మోహన్ స్పందిస్తే కానీ బయటకు రాదు. దీనిపై స్పందించినటువంటి రామ్మోహన్ అనుచరులు ఆయన అలాంటి వ్యక్తి కారని, డైరెక్ట్ గా రామ్మోహన్ ను ఎదుర్కోలేక కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: