ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప లోక్‌సభ నియోజకవర్గంలో ఎవరు ఎంపీగా గెలుస్తారనే చర్చ జరుగుతోంది. ఏ సర్వే చూసినా ఈ లోక్ సభ నియోజకవర్గంలో అవినాష్ దే గెలుపు అని వెల్లడిస్తున్నాయి. షర్మిల, సునీత అవినాష్ పై చెప్పుకోలేని స్థాయిలో చేస్తున్న విమర్శలే ఆయనకు ప్లస్ అవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
కాంగ్రెస్ తరపున షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నా కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్నికల్లో పోటీ చేయడానికి షర్మిల చెబుతున్న కారణాలు సైతం ప్రజలకు సరైన కారణాలు అనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో కడప బాద్‌షా అవినాష్ రెడ్డి అవుతారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. షర్మిల, సునీతలపై కూల్ గానే విమర్శలు చేయడం అవినాష్ రెడ్డికి ఒకింత కలిసొస్తోంది.
 
మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను నిలబడతానంటూ ఆయన చేస్తున్న కామెంట్లు కడప ఓటర్లలో ఆయనపై సానుభూతిని పెంచుతున్నాయి. షర్మిల, సునీత మాటలు కామెంట్లు వింటే కోపం కంటే ఎక్కువగా బాధ కలుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. వివేకా హత్య కేసే ప్రధాన ప్రచారాస్త్రంగా కడప ఎన్నికలు జరుగుతున్నా ఈ కేసులో అవినాష్ తప్పు చేశాడని చాలామంది నమ్మడం లేదు.
 
కడప రాజకీయాల్లో అవినాష్ రెడ్డి చక్రం తిప్పడం ఖాయమని ఈ ఎన్నికల్లో విజేతగా నిలిచి విమర్శలు చేసిన వాళ్లకు బుద్ధి చెప్పడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వివేకా హత్య కేసులో నిందితులు ఎవరో త్వరలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తనకు, తన కుటుంబ సభ్యులకు ఏ పాపం తెలియదని అవినాష్ పేర్కొన్నారు. కడప లోక్ సభ నియోజకవర్గంలో 16,39,066 ఓట్లు ఉండగా జగన్ సపోర్ట్, ఎమ్మెల్యేలతో సఖ్యత, జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు ప్లస్ అవుతోంది.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: