- వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి ఎన్టీఆర్ పేరు మార్చినా మెచ్చ‌ని జ‌నం
- జ‌గ‌న్ హ‌యాంలోనూ కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు బిల్లులు చెల్లించ‌ని వైనం
- ద‌మ్మున్న ప‌థ‌కం అయినా పేరు లేకుండా పోయిందే..!

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆరోగ్య శ్రీ అనేది కీల‌క‌మైన ప‌థ‌కం. ఒక‌వైపు ప్ర‌భుత్వం సొంత‌గా ఉచిత వైద్యాన్ని అందిస్తూనే.. మ‌రోవైపు ... పూర్తిగా పేద‌ల‌కు సైతం కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయాల‌నేది ఈ ఆరోగ్య శ్రీ ప‌థ‌కం ప్ర‌ధాన ల‌క్ష్యం . 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మయంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకు వ‌చ్చిన ఈ ప‌థ‌కంపై రాజ‌ముద్ర‌.. రాజ‌కీయ ముద్ర సైతం.. దివంగ‌త వైఎస్ దే. చిత్రం ఏంటంటే.. ఇది చ‌ట్టం కాదు. కేవ‌లం ప‌థ‌కం. అయినా.. కూడా... దీనిని తీసేసేందుకు ఏ ప్ర‌భుత్వ‌మూ సాహ‌సించ‌క పోవ‌డం గ‌మ‌నా ర్హం. రెండురాష్ట్రాలుగా విడిపోయినా కూడా.. రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ అంటే గిట్ట‌ని ప్ర‌భుత్వాలు ఏర్ప‌డి నప్పుడు కూడా.. ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల్సి వ‌చ్చిందంటే.. ఈ ప‌థ‌కానికి ఉన్న బ‌లం.. శ‌క్తి ఎలాంటి దో స్ప‌ష్టం చేస్తాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని చంద్ర‌బాబు హ‌యాంలో ఎలా అమ‌లు చేశారు?  ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎలా అమ‌లు చేశారు? అనేది కీల‌క‌మైన చ‌ర్చ‌నీ యాంశం. ఈ ప‌రంగా చూసుకుంటే.. అనేక అంశాలు క‌నిపిస్తాయి.

చంద్ర‌బాబు:

+ ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి పేరు మార్చే ప్ర‌య‌త్నం చేశారు. ఎన్టీఆర్  అని ఈ ప‌థ‌కానికి ముందు జోడించారు. కానీ, జ‌నాలు మెచ్చ‌లేదు. పైగా.. వైఎస్ పెట్టిన ప‌థ‌కం కావ‌డం.. ఆయ‌న పాల‌న అనంత‌రం తాను అధి కారంలోకి రావ‌డంతో చంద్ర‌బాబు ఈ ప‌థ‌కంపై శీత‌క‌న్నేశారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు(2014కు ముందు) తీసేయ‌బోము అన్న ఒక్క హామీతో కొన‌సాగించారు. కానీ,ఈ ప‌థ‌కాన్ని విస్త‌రించ‌లేక పోయారు. ఈ ప‌థ‌కం ప‌రిధిలోకి మ‌రింత మందిని చేర్చ‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యారు.


+ ఇక‌, వైద్య శాల‌ల‌కు... స‌కాలం లో బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డంతో ఒకానొక ద‌శ‌లో ఆరోగ్య ప‌థ‌కాన్ని ఎత్తేస్తున్న‌ట్టు ప్ర‌చారం కూడా జ‌రిగిం ది. ఇక‌, ఈ ప‌థ‌కం కింద‌.. రోగాల‌(జ‌బ్బుల‌) సంఖ్య‌ను పెంచుతామ‌ని చెప్పినా.. కార్యాచ‌ర‌ణ‌కు మాత్రం పూనుకోలేదు. నాశిర‌క‌మైన వైద్యం అందించ‌డంతో ఆరోగ్య శ్రీ ప‌థ‌కం కింద ఉన్న ల‌బ్ధిదారులు అవ‌స్థ‌లు ప‌డ్డారు. సో.. చంద్ర‌బాబు హ‌యాంలో పేద‌ల‌కు కీల‌క‌మైన ఈ ప‌థ‌కం `అయిష్టం`గానే అమ‌లు చేశార‌ని చెప్ప‌డంలో త‌ప్పులేదు.

జ‌గ‌న్‌:

+ ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా పేద‌ల‌కు ఎక్క‌డ ఎలా క‌నెక్ట్ కావాలో తెలిసిన జ‌గ‌న్‌.. ఎన్నిక‌ల‌కు ముందు ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని అస్త్రం చేసుకున్నారు. చంద్ర‌బాబు ఎక్క‌డ ఏ యాంగిల్‌లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారో.. గుర్తించి.. దానిపైనే ఫోక‌స్ చేసి ప్ర‌జ‌లకు భరోసా ఇచ్చారు. ఫ‌లితంగా ఆరోగ్య శ్రీ జగ‌న్ హ‌యాంలో ఇంతింతై.. అన్న‌ట్టుగా ఎదిగిపోయింది. మ‌ధ్య‌లో కార్పొరేట్ ఆసుప‌త్రుల నుంచి.. కొంత ఇబ్బందులు వ‌చ్చినా..(డ‌బ్బులు చెల్లించ‌క‌పోవ‌డం) త‌ర్వాత స‌ర్దుకుంది.


+ జ‌గ‌న్ హ‌యాంలో మేలిమి అన‌ద‌గిన ప‌థ‌కాల్లో ఆరోగ్య శ్రీ ముందుంటుంది. కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయ‌డ‌మే కాకుండా.. ఒక‌ప్పుడు ఉన్న అపోహ‌లు ఆయ‌న తొల‌గించారు. కార్డు ఉంటే.. వైద్యం అందిన‌ట్టే అనే ధీమాను తీసుకువ‌చ్చారు. 108, 104 వంటివాటిని బ‌లోపేతం చేశారు. ప్ర‌తి గ్రామానికి.. రెండే సి 104 వాహ‌నాలు కేటాయించే దిశ‌గా అడుగులు వేశారు. ఆరోగ్య‌శ్రీ పేరును ఈయ‌న కూడా మార్చాల‌ని నిర్ణ‌యిం చుకున్నారు. డాక్ట‌ర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అని మార్చినా.. పేరు మార్పుతో వ‌చ్చిన ప్ర‌యోజ‌నం ఏమీ క‌నిపించ‌లేదు.  ప‌థ‌కానికి ఉన్న ద‌మ్ము ముందు.. పేరుకు ల‌భించ‌లేదు.


+ మొత్తంగా.. అటు బాబు, ఇటు జ‌గ‌ను.. ఇద్దరి ఇష్టాయిష్టాలు ఈ ప‌థ‌కంతో తెలిసిపోయాయ‌నే చెప్పాలి. కానీ, ప్ర‌త్య‌ర్థి పెట్టిన ప‌థ‌కాన్ని కూడా కొన‌సాగించ‌క త‌ప్ప‌ద‌ని ఈ దేశంలో నిరూపించిన ఏకైక ప‌థ‌కం.. ఆరోగ్య శ్రీ అనేది నిర్వివాదాంశం. ఇప్పుడైనా స‌రే.. ఎప్పుడైనా స‌రే.. ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. ఈ ప‌థ‌కాన్ని తీసేయ‌లేనంత ముద్ర వేశారు దివంగ‌త‌ వైఎస్‌. !!

మరింత సమాచారం తెలుసుకోండి: