గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నారా లోకేశ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వైసీపీ వేవ్ ఉండటం లోకేశ్ కు ఎంతగానో మైనస్ అయిందని చెప్పవచ్చు. సాధారణంగా ఏదైనా నియోజకవర్గం నుంచి ఓడిపోతే ఆ నేతలు మరో నియోజకవర్గాన్ని ఎంచుకోవడం సాధారణంగా జరుగుతుంది. అయితే లోకేశ్ మాత్రం ఓడిన చోటే సత్తా చాటాలని భావించారు.
 
ఎమ్మెల్యేగా గెలవకపోయినా గత ఐదేళ్ల నుంచి మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ అక్కడి ప్రజల కష్టాలను తీరుస్తూ లోకేశ్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో లోకేశ్ నోరు జారకుండా ఒక విధంగా చెప్పాలంటే సైలెన్స్ తో సక్సెస్ అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలివైన వ్యూహాలతో లోకేశ్ పొలిటికల్ లెక్కలు మార్చేశారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
వైసీపీ నుంచి ఈ నియోజకవర్గంలో లావణ్య పోటీ చేస్తుండగా మంగళగిరిలో లోకేశ్ గెలుపును ఎవరూ ఆపడం సాధ్యం కాదని భోగట్టా. ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలవడం కల్ల అని లోకేశ్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబు కొడుకుగా కంటే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడానికే నారా లోకేశ్ ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
నారా లోకేశ్ ఎమ్మెల్యే అయ్యి కూటమి అధికారంలోకి వస్తే మాత్రం లోకేశ్ భవిష్యత్తులో టీడీపీలో నంబర్2 అవుతారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఎమ్మెల్యేగా విజేతగా నిలిచిన తర్వాత లోకేశ్ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ ఎన్నికల ఫలితాలతో విమర్శించిన వాళ్ల నోర్లను మూయిస్తానని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. నారా లోకేశ్ ఈ ఎన్నికల్లో ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారో చూడాల్సి ఉంది. నారా లోకేశ్ ఎన్నికల్లో గెలవడం కోసం మంగళగిరిలో టీడీపీ కార్యకర్తలు సైతం ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: