ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదట 2014 లో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మొదటి సారి కంటే మెరుగైన మెజారిటీని తెచ్చుకొని రెండవ సారి కూడా తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇలా రెండు సార్లు ఇదే ప్రభుత్వం తెలంగాణ లో రావడంతో మూడవ సారి కూడా వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా మూడవ సారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో మెజారిటీని తెచ్చుకొని ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

దానితో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ సీట్లను దక్కించుకొని తమ ఉనికిని చాటుకోవాలని అత్యంత ప్రయత్నాలను చేస్తుంది. అందులో భాగంగా ఈ పార్టీలోని అత్యంత కీలక నేతలు అందరూ కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కూడా తనదైన స్థాయిలో ప్రచారాలను చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా కేసీఆర్ ... మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా పటాన్‌ చెరువు లో రోడ్ షో ను నిర్వహించారు.

ఈ రోడ్ షో లో భాగంగా కేసీఆర్ ... బీజేపీ పార్టీపై , ఆ పార్టీ తీరుపై తనదైన స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజా రోడ్ షో లో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ ... ఊరికే గుడ్డిగా ఏమీ ఆలోచించకుండా ఓట్లు వేస్తే మన పిల్లల భవిష్యత్‌ పోతుంది. బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా లాభం జరుగలేదు. పేదలు , గిరిజనులు , మహిళలు , కార్మికుల కోసం ఓ మంచి చట్టం కూడా లేదు. అలాగే కనీస జీతాలు పెంచాలని చట్టాలు కూడా తేలేదు. కానీ పెట్టుబడిదారులకు మాత్రం కాపలాకాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి  బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఈ రోడ్ షోలో భాగంగా కేసీఆర్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: