ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ చేస్తున్న స్వయంకృతాపరాధమే ఇక ఇప్పుడు ఆ పార్టీని ఓడించబోతుందా అంటే మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లలో పరిస్థితి ఎలా ఉన్నా అటు మల్కాజిగిరిలో పరిస్థితి చూస్తే మాత్రం అందరూ అవును అనే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరిలో అటు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మల్కాజ్గిరి ఎంపీ స్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా. ఎందుకంటే ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి ఇది సిట్టింగ్ స్థానం.


 ఇక్కడ హస్తం పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేదు అంటే ఇక సీఎంగా ఉన్న రేవంత్ పోయినంత పని అవుతుంది. అయితే మల్కాజ్గిరి హస్తం పార్టీ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ చేసిన తప్పిదమే బిజెపికి అడ్వాంటేజ్ గా మారిందని ఏకంగా కాంగ్రెస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారట. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తారని భావించిన పట్ల మహేందర్ రెడ్డి సతీమణి సునీతను మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపడం కాంగ్రెస్ చేసిన వ్యూహాత్మక తప్పిదం అని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారట.


 అయితే బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ నాన్ లోకల్ అయినప్పటికీ కూడా ఆయనకు పార్టీ నేతల నుంచి సంపూర్ణ సహకారం అందుతుంది. ఇక బీసీ సామాజిక వారు మద్దతు కూడగట్టుకోవడంలో కూడా ఈటెల సక్సెస్ అయ్యారు. మరోవైపు పట్నం సునీతకు అటు స్థానిక నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతుంది. ఇంకోవైపు స్థానికేతరురాలు అనే ముద్ర కూడా పడింది. దీంతో ఇది ఆమె గెలుపు పై ప్రభావం చూపుతుంది. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో రేవంత్ ఇక్కడ పట్నం సున్నితను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఓడ్డుతున్నారు. కానీ ఎక్కువగా ఈటెల వైపే విజయ అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారట. మరి ఓటర్లు ఏ నిర్ణయించబోతున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: