టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సుహాస్ తాజాగా ప్రసన్న వదనం అనే సినిమాలో హీరోగా నటించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఈ నాలుగు రోజుల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ కి నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 45 లక్షల కలెక్షన్ లు దక్కగా ... మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.05 కోట్ల షేర్ ... 2.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి నాలుగు రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 35 లక్షల కలెక్షన్ లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 1.38 కోట్ల షేర్ ... 3.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ 2.5 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలిచే అవకాశం ఉంది. దానితో ఈ మూవీ మరో 1.1 కోట్ల షేర్ కలక్షన్ లను వరల్డ్ వైడ్ గా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: