మాస్ మహారాజా రవితేజ , రామ్ పోతినేని , విజయ్ దేవరకొండ , శర్వానంద్ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నారు . ప్రస్తుతం వీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు..? ఆ మూవీలకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతుంది అనే వివరాలను తెలుసు కుందాం.

రవితేజ ప్రస్తుతం హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . భాగ్య శ్రీమూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది . ఇకపోతే ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం రవితేజ మరియు మరి కొంత మంది ఇతరులపై హైదరాబాద్ లో ఆఫీస్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు . ఈ మూవీ హిందీ లో అద్భుతమైన విజయం సాధించిన రైడ్ మూవీ కి రీమిక్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

రామ్ పోతినేని ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ముంబై లో కొంత మంది కమీడియన్స్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు . ఈ మూవీ ఈస్మార్ట్ శంకర్ సినిమాకి కొనసాగింపు రూపొందుతుంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

శర్వానంద్ ప్రస్తుతం తన కెరియర్ లో 37 వ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం హైదరాబాదు లో శర్వానంద్ మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ మూవీ కి సంబంధించిన చిత్రీకరణను తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: